//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాశ్మీర్ సమస్యపై జాతీయ సదస్సుకు సన్నాహాలు

Category : national editorial

కాశ్మీర్లో సరిహద్దు వెంబడి దాదాపు ప్రతి రోజూ కాల్పుల ఉల్లంఘన జరుగుతూ ఉంటే పరిస్థితులను సరిదిద్దడం కోసం వాజపేయి ప్రారంభించిన సంప్రదింపుల పక్రియ కొనసాగించాలని ఆ రాష్త్ర ముఖ్యమంత్రి మహబూబ్ ముప్తి స్వయంగా కలసి కోరినా ప్రధాని నరేంద్ర మోడీ నుండి స్పందన లేదు. అయితే ఇప్పుడు ఢిల్లీలో ఈ అంశంపై జాతీయ స్థాయి సదస్సు ఏర్పరచడం ద్వారా పరిష్కార మార్గాల కోసం ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. 

గత సంవత్సరం రెండు విభిన్న ప్రతినిధి వర్గాలకు నాయకత్వం వహిస్తూ కాశ్మీర్ లోయలో పర్యటన జరిపిన బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, జె డి (యు) నాయకుడు శరద్ యాదవ్ కలసి ఈ ప్రయత్నం చేయడం గమనార్హం. ఇప్పటికే వారిద్దరూ రెండు సార్లు కలసి సన్నాహాలు చేశారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్,  సీతారాం ఏచూరి, ఇతర నాయకులతో సంప్రదింపులు జరిపారు. 

ఈ సదస్సులో బిజెపి తో సహా అన్ని పక్షాల ప్రతినిధులతో పాటు కాశ్మీర్ కు చెందిన మేధావులు, పాత్రికేయులు, ఇతర ప్రముఖులను సహితం ఆహ్వానిస్తున్నారు. వివిధ సందర్భాలలో కాశ్మీర్ లో పర్యటనలు జరిపిన ప్రతినిధి వర్గాలు, ఈ సమస్యపై అనుభవం గల నిపుణులు పాల్గొనేటట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరు లోగా జరిగే ఈ సదస్సుకు మాజీ రా అధినేత ఏ యస్ దూలాత్, మాజీ దూత యం యం అన్సారీ, మాజీ ప్రధాన సామాచార కమీషనర్ వ్యాజహాత్ హబీబుల్లాహ్, మాజీ వైమానిక దళాధిపతి కపిల్ కాక్ వంటి వారిని ఆహ్వానిస్తున్నారు.