//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఓఎన్‌జీసీ చేతిలోకి రానున్న హెచ్‌పీసీఎల్

Category : business

దేశంలో మూడవ పెద్ద ఇంధన విక్రయ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్)లో ప్రభుత్వానికి ఉన్న 51.11 శాతం వాటాను దేశంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థయైన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కి (ఓఎన్‌జీసీ) విక్రయించడానికిగాను కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ఖజానాకు రూ.26 వేల కోట్ల నుంచి రూ.30వేల కోట్ల వరకు నిధులు సమకూరనున్నాయని ప్రభుత్వ వర్గాలు అంచనావేస్తున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను విక్రయించడం ద్వారా సేకరించాలనుకున్న రూ.72,500 కోట్ల నిధుల్లో 40 శాతం లభించనున్నాయన్న మాట. ప్రభుత్వ వాటా విక్రయ అనంతరం హెచ్‌పీసీఎల్ ప్రత్యేక కంపెనీగా. ఓఎన్‌జీసీ సబ్సిడరీ సంస్థగా కొనసాగనున్నది. ఈ ఒప్పందానికి సంబంధించి గురువారం పార్లమెంట్‌లో కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఈ విలీనంతో మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్) కూడా ఓఎన్‌జీసీ పరిధిలోకి రానున్నది. ఎంఆర్‌పీఎల్‌లో హెచ్‌పీసీఎల్‌కు 16.96 శాతం, ఓఎన్‌జీసీకి 71.63 శాతం వాటా ఉంది. ప్రస్తుతం ఓఎన్‌జీసీ వద్ద రూ.13,014 కోట్ల నగదు నిల్వలు ఉండగా, మరో రూ.10 వేల కోట్లు రుణం చేయాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ఒపెన్ ఆఫర్‌ను ప్రకటించే అవకాశం లేదని ఓఎన్‌జీసీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరిలోగా ఈ ఒప్పందం పూర్తికానున్నట్లు తెలుస్తున్నది.