చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 5ను ఈ నెల 22వ తేదీన భారత్‌లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్ యూజర్లకు అమెజాన్ సైట్లో, వన్ ప్లస్ స్టోర్స్‌లో లభిస్తున్నది. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.32,999 ఉండగా, 8 జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.37,999 గా ఉంది. అయితే ఈ ఫోన్‌ను వన్‌ప్లస్ ఎక్కడ తయారు చేస్తున్నదో తెలుసా..? మన దేశంలోనే, నోయిడాలో..! నోయిడాలో ఉన్న ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో వన్‌ప్లస్ 5 తయారవుతున్నది. అంటే ఒప్పోకు వన్‌ప్లస్ 5 తయారీ కాంట్రాక్ట్‌ను వన్‌ప్లస్ అప్పగించినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది..! ఈ క్రమంలో వన్ ప్లస్ 5 బాక్స్‌పై తయారీదారు పేరు ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని కూడా ఉంటుంది.