//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒకే సిలబస్, ఒకే ప్రశ్నపత్రం.

Category : national

అన్ని రాష్ట్రాల్లోనూ ఇంటర్ లో కామన్ విద్యను ప్రవేశపెట్టాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ నేతృత్వంలో జాతీయస్థాయి కమిటీ సమర్పించిన నివేదికను సిబీఎస్ఈ ఆమోదించింది. వచ్చే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ లో ఒకే సిలబస్ తో పాటు ఒకే ప్రశ్న పత్రం ఉండనున్నట్లు, ఢిల్లీలో రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో జరిగిన సమావేశంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబీఎస్ఈ) ఈ నిర్ణయం తీసుకుంది.

ఎన్ సీఈఆర్ టీ సిలబస్ కు అనుగుణంగా రాష్ట్రాల సిలబస్ లో మార్పులు చేర్పులు చేసుకున్న రాష్ట్రాలు, ఇందుకు సంబందించిన అధికార ఉత్తర్వులు వెలువడిన వెంటనే అమలులోకి తీసుకురావాలని, వచ్చే రెండేళ్లలో అన్ని రాష్ట్రాల కామన్ సిలబస్ ను కచ్చితంగా అమలు చేయాలని సిబీఎస్ఈ స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక కమిటీని రూపొందించి కామన్ సిలబస్ ను అన్ని రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డుల కార్యదర్శులకు సిబీఎస్ఈ అందజేసింది. అయితే నీట్, ఐసీట్ 2012 ఉమ్మడి ఏపీ నేపథ్యంలో సిలబస్ కు అనుగుణంగా ఇప్పుడు సిలబస్ ను మార్చినందున, సిలబస్ మార్పు ప్రభావం ఏపీ, తెలంగాణ విద్యార్థులపై పెద్దగా అవకాశాలు లేవంటూ సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.