సెల్ఫీ పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతోంది.
ప్రత్యేకంగా సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, లైకులు సంపాదించుకోవాలని యువత తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పిచ్చి పిచ్చి విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యాకి చెందిన ఓ యువకుడు అతి ప్రమాదకర విన్యాసానికి ఒడిగట్టాడు. చివరికి దాని వల్ల అతను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
అలెగ్జాండర్ సాష ఛెచిక్... చేతిలో గ్రనేడ్ పట్టుకుని ఫొటోలు దిగాడు. వాటిని స్నేహితులతో కూడా పంచుకున్నాడు. తర్వాత గ్రనేడ్ పిన్ తీసి ఫొటోలు దిగాలని ప్రయత్నించాడు. స్నేహితులు వారిస్తున్నా వినిపించుకోకుండా గ్రనేడ్ పిన్ తీశాడు.
పిన్ తీశాక కూడా అలాగే చేత్తో పట్టుకుని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. కానీ గ్రనేడ్ పేలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మొదట పోలీసులు ఇది ఆత్మహత్య అనుకున్నారు. తర్వాత ఛెచిక్ స్నేహితులు చెప్పినది విని పొరపాటున జరిగిన ప్రమాదమని స్పష్టం చేశారు.