తన ప్రాణం పోతు కూడా ఐదుగురి ప్రాణం కాపాడింది ఒక అమ్మాయి. తన ప్రాణం పోయినా బ్రతికింది. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా రామగిరి ప్రాంతానికి చెందిన మౌనిక(21) ఎస్‌ఆర్‌టీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నారు. మే 28వ తేదీన పానాగల్ బైపాస్ రామగిరి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలవగా స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి మే 29న తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మే 30న ఆమెను బ్రెయిన్ డెడ్ గా పేర్కొన్నారు. దీంతో జీవన్‌దాన్ ప్రతినిధులు ఆమె కుటుంబసభ్యులకు అవగాహన కల్పించడంతో అవయవదానానికి అంగీకరించారు. ఆమె మూత్రపిండాలు, కళ్లు, కాలేయం పలు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న అవసరమైన వారికి అమర్చారు.