డిజిటల్ వాలెట్ యాప్ పేటీఎం తన యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తరకం సర్వీసుతో ముందుకు వచ్చింది. అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు డిజిటల్ గోల్డ్ ఆఫర్ చేస్తోంది. ఒక్క రూపాయికే బంగారాన్ని కొనవచ్చంది. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ద్వారానే బంగారం కొనడం, అమ్మడం చేయవచ్చని ప్రకటించింది. పేటీఎం మొబైల్ వాలెట్ లోనే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ను ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చని చెప్పింది.
ఇందుకోసం ఎలాంటి ఛార్జీలు వసూల్ చేయడం లేదన్నారు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ. పేటీఎంతో టై అప్ అయిన ఎంఎంటీసీ-పీఏఎంపీలోసెక్యుర్ గా గోల్డ్ ను ఐదేళ్ల పాటు స్టోర్ చేసుకోవచ్చని వెల్లడించారాయన. అవసరమైనప్పుడు గోల్డ్ ను కాయిన్స్ రూపంలో ఇంటికే గోల్డ్ ను డెలివరీ చేస్తామన్నారు లేదా తిరిగి ఆన్ లైన్ లోనే ఈ గోల్డ్ ను అమ్ముకోవచ్చని చెప్పారు.