//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఓల్డ్‌ మంక్‌ సృష్టికర్త కన్నుమూత

Category : world

ప్ర‌పంచంలో బెస్ట్ సెల్లింగ్ ర‌మ్‌గా నిలిచిన ఓల్డ్ మాంక్ సృష్టిక‌ర్త, ప్రముఖ లిక్కర్‌ వ్యాపారి కపిల్‌ మోహన్‌ ఇక లేరు.

క‌పిల్ మోహ‌న్ ఈ నెల 6న గుండెపోటుతో మరణించారు. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘ‌జియాబాద్‌లో మోహ‌న్ న‌గ‌ర్‌లోని త‌న ఇంట్లో ఆయ‌న మ‌ర‌ణించారు. మోహ‌న్ మేకిన్ లిమిటెడ్ పేరుతో ఓల్డ్ మాంక్ ర‌మ్ సంస్థ‌ను ఆయ‌న నెల‌కొల్పారు.

మోహ‌న్ మేకిన్ లిమిటెడ్ పేరుతో 1954లో ఓల్డ్ మాంక్ ర‌మ్ సంస్థ‌ను ఆయ‌న నెల‌కొల్పారు. ఓల్డ్ మాంక్‌తో పాటు సోలా నెం.1, గోల్డెన్ ఈగ‌ల్ వంటి మ‌రో రెండు బ్రాండుల‌ను కూడా ఆయ‌న సృష్టించారు. ‘డార్క్‌ రమ్‌’గా ఓల్డ్‌ మంక్‌ అమ్మకాలు కొన్నేళ్లపాటు జోరుగా సాగాయి. 1954, డిసెంబ‌ర్ 19న ఓల్డ్ మాంక్ ర‌మ్‌ను క‌పిల్ మోహ‌న్ ఆవిష్క‌రించారు.

స్వ‌త‌హాగా ఎలాంటి మ‌ద్యం తీసుకోని క‌పిల్ మోహ‌న్ లిక్కర్‌ కింగ్‌గా ప్రాచుర్యం పొందినప్పటికీ.. చక్కెర, వస్త్ర పరిశ్రమలను కూడా విజయవంతంగా ముందుకు నడిపించారు. వ్యాపార రంగంలో మోహన్‌ కృషికి గాను కేంద్ర ప్రభుత్వం 2010లో ఆయనను ప‌ద్మ‌శ్రీ పురస్కారంతో స‌త్క‌రించింది. ఆయన అనారోగ్యం బారిన పడటంతో వ్యాపారాన్ని బంధవులకు అప్పగించేశారు. గత కొంత కాలంగా ఓల్డ్‌ మంక్‌ నష్టాల్లో కొట్టుమిట్టాడుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.