//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒకవైపు డ్రైవ్ చేస్తూ మరో పక్క ఆ పని చేసాడు ....!

Category : national state

నగ్న చిత్రాలు చూస్తూ క్యాబ్ నడిపిన డ్రైవర్ ఓ మహిళా బెంగళూరులోని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం అక్కడ హాట్ టాపిక్ అయ్యింది. అసలు విషయానికొస్తే వెళ్తే బెంగళూరుకు చెందిన మహిళ శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఎలంక ప్రాంతంలో ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకుంది. జేపీ నగర్‌లోని తన ఆఫీస్‌‌కు క్యాబ్‌లో వెళ్తోంది.

ఒకవైపు కారును డ్రైవ్ చేస్తూనే మరోవైపు తన ఫోన్లో ఓలా డ్రైవర్ అశ్లీల వీడియోలు చూస్తున్నాడు. అతడి కుడి పక్కసీటులోనే కూర్చొన్న మహిళ అతడి చేష్టలను గమనించి విస్తుపోయింది.దాంతో వెంటనే చిర్రెత్తుకొచ్చి కారును ఆపేయమంటూ గట్టిగా అరిచింది. అయినప్పటికీ ఆమె మాటలను అతడు వినకుండా కారును అలానే ముందుకు తీసుకెళ్లాడు. కానీ, చివరికి కస్తుర్భా రోడ్ వద్ద కారును ఆపడంతో దిగి పక్కనే ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై స్పందించిన ఓలా యాజమాన్యం.. క్యాబ్ డ్రైవర్ వైఖరి పట్ల షాక్ అయినట్టు తెలిపింది. వెంటనే సదరు డ్రైవర్‌ను తమ సర్వీసు నుంచి తొలగించినట్టు తెలిపింది. అమహిళకి క్షమాపణలు చెప్పింది ఓలా సర్వీస్ యాజమాన్యం .

Related News