//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ గురుద్వారకు వెళ్లి మొక్కులు చెల్లించాలంటే విమానం బొమ్మ కొనుక్కోండి... ఎందుకంటే

Category : editorial

మీ కోరికలు తీరాలంటే, మీ విదేశీయానం సక్రమంగా జరగాలంటే, మీ కష్టాలన్నీ తీరిపోవాలంటే ఒక విమానం బొమ్మను కొనుక్కోండి సరిపోతుంది. విమానం బొమ్మనా .. ఎందుకు అని అడుగుతారా.. పంజాబ్ రాష్ట్రంలోని ఒక దేవుడికి విమానం బొమ్మను సమర్పిస్తే సమస్యలన్నీ ఇట్టే పరిష్కారమై పోతాయట.. ఇది అక్కడి ప్రజల నమ్మకం. మీకు కూడా భగవంతుని పట్ల అటువంటి నమ్మకాలుంటే విమానం బొమ్మ కొనుక్కొని ఎంచక్కా జలంధర్ దగ్గర ఉన్న గురుద్వార కు వెళ్ళండి.

మనకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే దేవుణ్ని తలుచుకుంటాం. భగవంతుడికి అన్ని బాధలు చెప్పుకుంటాం. దేవుడిని నమ్మితే మన కష్టాలు తీరుతాయని మనం నమ్మకం. అయితే ఒక్కో దేవున్ని మనం ఒక్కోలా పూజిస్తుంటాం. ఒక్కోవిధంగా ఆరాధిస్తుంటాం. ఇక పంజాబులోని జలంధర్‌ కు సమీపంలోని ఒక గురుద్వారాలో దేవుడికి భక్తులు మొక్కులు చెల్లించుకునే తీరు కాస్త భిన్నంగా ఉంటుంది.

జలంధర్ కు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే తల్హాన్‌ గ్రామంలో గురుద్వారా కొలువై ఉంది. ఇందులో బాబా షహీద్‌ నిహల్‌ సింగ్ కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. నిహాల్‌ సింగ్‌ కు సంబంధించిన సమాధి గురుద్వారాలోనే ఉంది.ఆయన అందులో మంచి నేర్పరి. అలాగే నిహాల్ పై మరో నమ్మకం కూడా జనాలకు ఏర్పడింది. ఆయన ఏ బావికి గిలక అమర్చినా అది ఎప్పటికీ ఎండిపోదు అని జనాలు నమ్మేవారు. అందుకే ప్రతి బావికి తన చేతితోనే గిలకను కట్టించేవారు. ఆయన గిలక అమర్చితే ఆ బావిలో నీరు కూడా తియ్యగా మారుతుందని జనాల నమ్మకం.అయితే ఒకసారి నిహాల్‌ సింగ్ ఒక బావికి గిలక అమర్చడానికి బయల్దేరాడు. దాన్ని అమర్చుతుండగా ప్రమాదవశాత్తూ బావిలో పడి మరణించాడు. ఇక స్థానికులంతా కన్నీరుమున్నీరయ్యారు. తల్హాన్‌ గ్రామంలో గురుద్వారాలో ఆయన్ని సమాధి చేశారు.

ప్రతి సంవత్సరం నిహాల్ సింగ్‌ వర్ధంతిని పురస్కరించుకుని గ్రామంలో పెద్ద జాతర జరుగుతుంది. జాతర సందర్భంగా గ్రామంలో వివిధ పోటీలు నిర్వహిస్తారు. చాలా ప్రాంతాల నుంచి జనాలు కూడా వస్తారు. అయితే నిహాల్ సింగ్ కొలువైన గురుద్వారాలో విమానం బొమ్మను సమర్పిస్తే తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఎక్కువగా ఇక్కడ విమానం బొమ్మల్ని ముడుపుగా సమర్పిస్తుంటారు. అలా చేసిన వెంటనే వీసా వచ్చేసి విదేశాలకు వెళ్లిపోయిన వారు చాలా మందే ఉన్నారట. విదేశ ప్రయాణాలకు ఉన్న అడ్డంకులన్నీ ఈజీగా తొలిగిపోతాయంట. దీంతో గురుద్వారాకు రోజూ వేలాది మంది వెళ్లి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు.