//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేడు జగన్నాథుని రథయాత్ర.. జై జగన్నాథ నామస్మరణతో మార్మోగుతు ఆలయాలు...!

Category : state national editorial

దేశంలోని సుప్రసిద్ధ ఆలయాల్లో ఒకటిగా , జగన్నాధ స్వామి ఆలయాల్లో అగ్రగామిగా విరాజిల్లుతున్న క్షేత్రం పూరీ. ఈ ఆలయానికి ఎన్నో యేళ్ళ చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని 12 వ శతాబ్దం లో నిర్మించారని అందరూ చెపుతుంటారు. సనాతన సంప్రదాయాలకు, ఆచారాలకు నిలయమైన ఈ ఆలయం లో జగన్నాధ, బలభద్ర, సుభద్ర అమ్మవార్లు కొలువైయున్నారు.

ఈ పుణ్యక్షేత్రం ఒడిశా రాష్ట్రంలోని పూరీ జిల్లాలో ఈ పూరీ క్షేత్రం ఉంది. సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రల సమేతంగా బ్రహ్మాండ నాయకుడు మూడు రథాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ మహత్తర ఘట్టాన్ని చూసి, తరించేందుకు పూరీ క్షేత్రానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిండిపోయిన పూరీ వీధులన్నీ జై జగన్నాథ నామస్మరణతో మార్మోగుతున్నాయి.

పంచంలోని ఏ హిందూ ఆలయంలోనైనా సరే, ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును ఉపయోగించారు. దీని కోసం ఉత్సవ విగ్రహాలుంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం ఆనవాయితీ. అయితే ఈ సంప్రదాయాలన్నింటికీ పూరీ జగన్నాథాలయం కి మినహాయింపు ఇవ్వాలి . బలభద్ర, సుభద్రల సమేత జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. కాబట్టే జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భక్తులు భావిస్తారు.

రథయాత్ర నేపథ్యంలో శనివారం నిర్ణీత వేళల్లో పురుషోత్తముడి సేవలు జరిగేలా శ్రీక్షేత్ర యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రథయాత్రను విజయవంతం చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. రెండు రోజులపాటు జరిగే ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రభత్వం.

Related News