//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆంధ్ర ఆక్టోపస్‌ పక్కన నూతన్ నాయుడు ఎంట్రీ పై ...... సర్వత్రా అనేక అనుమానాలు....?

Category : politics

ఏపి ఎన్నికల ఫలితాల పై ఇప్పటికే ఎన్నో సంస్థలు అనేక సర్వేలు నిర్వహించారు.అయితే తాజగా ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ సైతం తన ఎన్నికల సర్వే వచ్చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఒక రోజు ముందుగానే సంకేతాలు ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఆయన తన అంచనాలు వెల్లడించారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో టీడీపీకి 80 నుంచి 110 సీట్లు , వైసీపీకి 60 నుంచి 77 సీట్లు, ఇతరులకు 1-7 సీట్లు వచ్చే అవకాశం ఉందని లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ మరోసారి స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానున్నట్టు ఆయన తన సర్వేలో వెల్లడించారు. ఇక లోక్ సభ స్థానాల విషయంలోనూ టీడీపీకే మొగ్గు ఉందని రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ 14-17, వైసీపీ 8-10 ఇతరులు 0-1 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని లగడపాటి రాజగోపాల్ టీమ్ సర్వే అంచనా వేసింది.

అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వే విషయాల సంగతి అటుంచితే... లగడపాటి రాజగోపాల్ సర్వే ప్రెస్ మీట్‌లో తెలుగు ప్రేక్షకులను బాగా పాయింట్ అవుట్ చేసిన మరో విషయం ఉంది.. ఈ సర్వే ఫలితాలను ఆయన వెల్లడించే ముందు ఆయన పక్కనే మరో ప్రముఖ వ్యక్తి ఉండడం అందరి ఆలోచనల కు కొత్త అనుమానాలను కలిగిస్తూ ఉంది.ఆ విషయం ఏమిటి అంటే ‘బిగ్‌బాస్-2’ పార్టిసిపెంట్ నూతన్ నాయుడు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అసలు నూతన్ నాయుడుకీ, లగడపాటి రాజగోపాల్‌కు ఉన్న సంబంధం ఏంటి....? అన్న ప్రశ్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతో ఆసక్తికి గురి చేస్తున్న ప్రశ్న.లగడపాటి తన సర్వే ఫలితాలు వెల్లడి స్తున్న క్రమంలో నూతన్ నాయుడు ఆయన పక్కనే ఎంతో దర్జాగా కూర్చుని ఉండడం ప్రతి ఒక్కరి ఆలోచనలకు పదును పెడుతున్నటు వంటి ప్రశ్న.

ఇది ఇలా ఉంటే లగడపాటి పై సాన్నిహిత్యం పెంచుకున్న నూతన్ నాయుడు, ప్రత్యేక్ష రాజకీయాల్లోని ఘనంగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న డెమో అని కొందరు భావిస్తుంటే... మరికొందరు నూతన్ నాయుడు, లగడపాటి రాజగోపాల్ బినామీయేమోనని ...మరికొందరేమో లగడపాటి ప్రెస్ మీట్ పెట్టిన ఫోర్చూన్ గ్రాండ్ హోటల్ నూతన నాయుడిదేనని, అందుకే పక్కనే కూర్చీ వేసుకుని దర్జాగా కూర్చున్నాడని అనేక అనుమానాలకు పోతున్నారు .అయితే గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నూతన్ ... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ ఆశించే ఆలోచనల్లో ఉన్నట్టు సమాచారం. ఈసారి కాకపోయినా వచ్చే ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, అప్పుడు తనకు టికెట్ పక్కా అవుతుందనే ఉద్దేశంతో లగడపాటి అండ్ కోతో సన్నిహితంగా మెలుగుతున్నట్టు సమాచారం. మరి ఈ ‘బిగ్‌బాస్’ పార్టిసిపెంట్ బిగ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం ఆగాల్సిందే.