//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్యాంక్ లలో కూడా ఇక నంబర్ పోర్టబిలిటీ !

Category : business

ప్రస్తుతం  మొబైల్ కంపెనీలను మార్చుకున్న మొబైల్ నెంబర్  మారకుండా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సదుపాయం పొందుతున్నాం. త్వరలో ఇటువంటి సదుపాయం బ్యాంకింగ్ రంగంలోనూ  కూడా లభించే అవకాశం కనబడుతున్నది. ఒక బ్యాంక్ నుండి మరో బ్యాంక్ కు అకౌంట్ మార్చుకున్నా అకౌంట్ నంబర్ మారే అవసరం లేకుండా పోర్టబిలిటీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. 

దీనితో  బ్యాంక్ ఖాతాదారులు ప్రస్తుత అకౌంట్ నంబర్‌తోనే వేరే బ్యాంకు సర్వీసులను ఎంచుకోనే అవకాశం ఉంటుంది. తద్వారా ఖాతాదారులు ఇతర బ్యాంక్‌కు మారినప్పటికీ గత లావాదేవీల ( సొమ్ము డిపాజిట్, నగదు ఉపసంహరణ) చరిత్రను కోల్పోరు. తద్వారా వారు తమ పరపతి రేటింగ్‌ను పదిలపర్చుకోవచ్చు. 

దేశంలో ఇప్పటికే వంద కోట్లకు పైగా ఆధార్ కార్డు జారీ చేయడంతోపాటు ఆర్థిక సేవల రంగంలో ఆధునిక సాంకేతిక వాడకం పెరిగిన నేపథ్యంలో బ్యాంకులు అకౌంట్ నంబర్ పోర్టబిలిటీ సేవలందించేందుకు కృషి చేయాలని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా సూచించారు. గడిచిన రెండేండ్లలో బ్యాంక్ ఖాతాలతో ఆధార్ అనుసంధానం జరిగింది. 

ఎన్‌పీసీఐ ప్లాట్‌ఫాం ద్వారా పలు పేమెంట్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇక బ్యాంక్ అకౌంట్ నంబర్ పోర్టబిలిటీ సేవలందించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది ముంద్రా చెప్పారు. పోర్టబిలిటీ సేవలపై నియంత్రణ మండలి ప్రతిపాదించేకంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఓ నిర్ణయానికొస్తే బాగుంటుందని ఆయన సూచించారు. బ్యాంక్ అకౌంట్ నంబర్ పోర్టబిలిటీ సేవలందించడంలో ఆధార్ నంబర్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) కీలకపాత్ర పోషించనున్నాయి.