//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రహస్య కెమెరా తో నగ్న విడియోలు... హోటల్ పై 700 కోట్ల దావా వేసిన అమెరికా మహిళ

Category : state

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ హోటల్‌గా గుర్తింపు పొందిన హిల్టన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌పై ఒక మహిళ  100 మిలియన్‌ డాలర్ల పరువు నష్టం దావా వేసింది.  హోటల్‌ గదిలో తాను స్నానం చేస్తుండగా రహస్య కెమెరాతో చిత్రీకరించారని, ఆ తరువాత  ఆ వీడియోను అశ్లీల వెబ్‌సైట్లలో పోస్టు చేశారని బాధిత మహిళ  కేసు పెట్టింది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన గురించి ఇటీవలే తెలుసుకున్న మహిళ వెంటనే న్యాయస్థానాన్ని  ఆశ్రయించడం జరిగింది. ఈ రకంగా ఆమె భారత్ కరెన్సీ లో చూసుకుంటే దాదాపు 700 కోట్ల రూపాయల దావా వేసింది.

అయితే ఈ బాధిత మహిళా షికాగోకు చెందిన బార్‌ పరీక్షల నిమిత్తం 2015 జులైలో న్యూయార్క్‌ వెళ్లారు. అక్కడ అల్బనీలోని హాంప్టన్‌ ఇన్‌ అండ్‌ సూట్స్‌ హోటల్‌  అదే గ్రూప్ కి చెందిన హోటల్ లో ఒక గది తీసుకున్నారు. ఆ సమయంలో సదరు మహిళ గదిలో స్నానం చేస్తుండగా అక్కడే ఉన్న రహస్య కెమెరాలో రికార్డయ్యింది. ఈ విషయం తెలియని మహిళ తిరిగి షికాగో వెళ్లిపోయారు.సరిగ్గా ఇది జరిగిన మూడు ఏళ్ల కి ఈ విషయం వెలుగుచూసింది.

అయితే మూడేళ్ల తర్వాత ఈ ఏడాది సెప్టెంబరులో ఆ మహిళకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఈ-మెయిల్‌ వచ్చింది. ‘ఈ వీడియోలో ఉన్నది మీరే కదా’ అంటూ అశ్లీల వెబ్‌సైట్ లింక్‌ను ఆ వ్యక్తి ఈ-మెయిల్‌లో పంపాడు.ఈ రకంగా ఆమెను భయానికి గురి చేసేలా ఆమె నుంచి  తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలని లేదంటే ఆ వీడియోను ఇతర సైట్లలో కూడా పోస్టు చేస్తానని బెదిరించాడు.దీని ద్వారా ఆ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు.దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాధిత మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని హిల్టన్ హోటళ్లపై 100 మిలియన్‌ డాలర్లకు దావా వేశారు.

కాగా.. ఘటనపై హిల్టన్ గ్రూప్‌ స్పందించింది. హోటల్‌కు వచ్చే అతిథుల భద్రత, ప్రైవసీపై తాము సీరియస్‌గా ఉంటామని.. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు మేము  అన్ని విధాల సహకరిస్తామని హామీ ఇచ్చింది. గడిచిన మూడేళ్లలో ఇలాంటి సంఘటనలు ఇంకెన్ని జరిగి  ఉండొచ్చు.. ఇప్పటి వరకు ఎలా ఇంకెంత మంది

ఇబ్బంది పడి ఉంటారో మాత్రమ్   బాధితులు ఇప్పటివరకు ఐతే బయటికి రాలేదు. ఈ కేసు తరువాత ఇంకెవరైనా వస్తారేమో వేచి చూడాలి .

Related News