//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీ చైతన్య - నారయణ మధ్య మరో గొడవ ఏంటంటే ?

Category : editorial

శ్రీ చైతన్య, నారాయణ మధ్య ఉన్న పోటీ గురించి మనందరికీ తెలుసు అయితే ఆ మధ్య పోటీ కాస్త తగ్గించి రెండు సంస్థలు కలిసి శ్రీ చైతన్య నారాయణ అకాడమీ అంటూ ఒక సంస్థని నెలకొల్పాయి. అయితే ఒక విద్యార్ధి విషయంలో గొడవ పడ్డ రెండు సంస్థలు ఎంతలా రెచ్చిపోయి విమర్శలు చేసుకున్నాయో మనందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు మరల రెండు సంస్థలు గొడవలతో రోడ్డున పడ్డాయి. ఇంతకి విషయం ఏంటంటే ఇటీవల NTSE స్టేజ్ 1 పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. అందులో చైతన్య విద్యార్థులు పెద్ద ఎత్తున రెండో స్థాయి పరీక్షకు అర్హత సాధించారు.

సెకండరీ స్కూల్ స్థాయిలో ప్రతిభ గల విద్యార్ధులకి ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించినందుకు చైతన్య తమ అచ్చోచ్చిన విధంగానే 1 1 2 2 2 3 3 3 యాడ్ లు ఇవ్వడం మొదలు పెట్టారు.

కాని ర్యాంకులు రాని నారాయణ మాత్రం కొత్త కారణాలు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ రేసులో చైతన్య దూసుకెళ్లడానికి సెల్ఫ్ సెంటర్స్ అని నారాయణ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. స్వప్రయోనాల కోసం ఈ పోరాటం మొదలు పెట్టినా దీని వల్ల నిజమైన ప్రతిభకు జరిగే మేలుని దృష్టిలో ఉంచుకుని విద్యావేత్తలు ఇందులో భాగం కావడానికి సంసిద్ధం అవుతున్నారు.

Related News