//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎమ్మెల్యే తో ఎన్టీఆర్ ....!

Category : movies

కళ్యాణ్ రామ్ పటాస్ చిత్రంతో చాల గ్యాప్ తీసుకుని భారీ విజయం సాధించిన విషయం తెలిసిన విషయమే.ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ కథానాయకిగ నటిస్తున్న ఈ చిత్రానికి ఉపేంద్ర మాధమ్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు.

‘ఎమ్మెల్యే’ టైటిల్ పాటు టీజర్, సాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. వివరాలలోకి వెళ్తే, ఇటీవల కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ తో జై లవ కుశ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ నెల 17 కర్నూల్‌లో జరిగే ‘ఎమ్మెల్యే’ ఆడియో ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్‌గా హాజరౌతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షూట్‌కు రెడీ కాగా, రామ్ చరణ్‌తో రాజమౌళి దర్శకత్వంలో పనిచేసేందుకు సిద్ధం అవుతున్నారు.ఈ చిత్ర ఆడియో ఈవెంట్ లో ఐనా ఎన్టీఆర్ రాజమౌళి ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.