//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ ఫాన్స్ మీసం మెలివేసే న్యూస్ !

Category : movies

ఎన్టీఆర్ ఈ పేరు ఒక ప్రభంజనం. జయ అపజయాలకు అతీతంగా అభిమాన సంద్రాన్నిఏర్పర్చుకున్న ఈ యంగ్ టైగర్ ఇప్పుడు ఏ టాప్ హీరో, స్టార్ హీరో కూడా చేయని సాహసం చేసి జై లవ కుశ తో తన నటనవిశ్వరూపం కనపరిచాడు. టెంపర్ నుండి తన నటనలో ఎన్నో వేరియేషన్స్ చూపించి అభిమానులను గర్వపడేలా చేసారు.

కేవలం నటన మాత్రమే కాదు,ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అల్ రౌండర్ ఎవ్వరు అని అంటే ఒక్క ఎన్టీఆర్ పేరు వినపడతది. జై లవ కుశ తరవాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో ఒక మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రం పై ఊహించని విధం గా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పై ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది.

వివరాలలోకి వెళ్తే, అజ్ఞాతవాసి సినిమా ఫలితం తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలా ? వద్దా ?.. అని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నట్టు వార్తలు పుట్టుకొచ్చాయి. ఒక్క సినిమా అపజయం పాలైనంత మాత్రానా మాటల మాంత్రికుడిపై తనకు అభిమానం, గౌరవం, నమ్మకం కొంచెం కూడా తగ్గలేదని ఎన్టీఆర్ అభిమానులతో స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ కి ఈ సినిమా చేయడంలో ఎటువంటి సందేహం లేదని తెలిసిపోయింది. మరి అభిమానులు ఏమనుకుంటున్నారు? .. ఇదే అంశంపై ఓ న్యూస్ ఛానల్ వాళ్ళు సర్వే నిర్వహించారు. 2018లో రానున్న తెలుగు చిత్రాల్లో ఏది క్రేజీయెస్ట్ మూవీ అని సర్వే చేపట్టింది.

రామ్ చరణ్, సుకుమార్ కాంబో మూవీ ‘రంగస్థలం’, మహేశ్ బాబు – కొరటాల శివ కలయికలో వస్తున్న “భరత్ అనే నేను”, అల్లు అర్జున్ “నా పేరు సూర్య”, ప్రభాస్ “సాహో”, తారక్, త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కే సినిమాలలో దేనికోసం మీరు ఎదురుచూస్తున్నారు ? అని సినీ ప్రేక్షకులను అడగగా వారు ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చారు.

ఈ సర్వేలో పాల్గొన్న వాళ్లలో 70 శాతం మంది తారక్, త్రివిక్రమ్ సినిమా అని చెప్పారు. ఈ సర్వే ఫలితం ఎన్టీఆర్ తో పాటు ఈ చిత్ర బృందానికి ఉత్సాహాన్నిచ్చింది. అజ్ఞాతవాసి దెబ్బకి నిరాశలో ఉన్న నిర్మాత రాధాకృష్ణకి ఈ ఓటింగ్ ఎనర్జీని ఇచ్చింది. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ వచ్చే నెల సెట్స్ మీదకు వెళ్లనుంది

Related News