//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్‌, ర‌జ‌నీ, విజ‌య్ ఆల్ టైమ్ రికార్డ్స్‌..!

Category : movies

ఒక‌ప్పుడు ఒక సినిమా వంద కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకోవ‌డానికి వారాలు ప‌ట్టేది. కానీ, రీసెంట్‌గా నిలీజైన సినిమాల‌న్నీ కూడా రెండు మూలు రోజుల్లోనే వంద కోట్ల మార్క్‌ను అందుకుంటూ సంచ‌ల‌నాల‌ను న‌మోదు చేస్తున్నాయి. వరుస సినిమాల‌తో ఈ రికార్డును అందుకున్న హీరోలు కూడా ఉన్నారు. రెండేసి సినిమాల‌తో టాలీవుడ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లు ఈ రికార్డ్‌ను సొంతం చేసుకోగా వీరిలో ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మూడు సార్లు వంద కోట్ల గ్రాస్ మార్క్‌ను కంటిన్యూగా అందుకుని ఆల్‌టైమ్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాసిన విష‌యం తెలిసిందే.

సౌత్ ఇండ‌స్ట్రీలో కూడా మిగిలిన హీరోల‌తో పోల్చుకుంటే కేవ‌లం ఎన్టీఆర్‌తో క‌లుపుకుని ముగ్గురు హీరోలు మాత్ర‌మే ఈ రికార్డుల‌ను మూడుసార్లు వ‌రుస సినిమాల‌తో సొంతం చేసుకుని సంచ‌ల‌నం సృష్టించారు. ఆ ముగ్గురు హీరోలే సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్, ఇళ‌య‌ద‌ల‌ప‌తి విజ‌య్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ న‌టించిన గ‌త మూడు సినిమాలు వ‌రుస‌గా వంద కోట్ల గ్రాస్ మార్కెట్‌ను అందుకుని సంచ‌ల‌నాలు సృష్టించ‌గా ర‌జ‌నీకాంత్ న‌టించిన గ‌త మూడు సంవ‌త్స‌రాలు లింగ‌, క‌బాలి, కాలా సినిమాలు వంద కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగ‌మించి సంచ‌ల‌నం సృష్టించాయి.

ఇక ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన సినిమాల‌లో తెరి, భైర‌వ‌, మెర్స‌ల్ సినిమాలు వంద కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగ‌మించిన‌ట్టు స‌మాచారం. న‌ట రుద్రుడు ఎన్టీఆర్ న‌టించిన మూడు సినిమాలు జ‌న‌తా గ్యారేజ్‌, జై ల‌వ కుశ‌, అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమాలు బాక్సాఫీసు ద‌గ్గ‌ర వంద కోట్ల గ్రాస్‌మార్క్‌ను అందుకుని సంచ‌ల‌నం సృష్టించాయి. దాంతో సౌత్ ఇండ‌స్ట్రీలో ఈ ముగ్గురు హీరోలు ఒక‌టి త‌రువాత మొర‌క‌టి ఇలా మూడు సినిమాల‌తో వంద కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుని సంచ‌ల‌న రికార్డులు న‌మోదు చేశారు.