Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ కొత్త చిత్రానికి... గ్రీన్ సిగ్నల్?

Category : movies

రాజమౌళి డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి "ఆర్ఆర్ఆర్" చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా పలు కారణాల కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. అయినప్పటికీ చిత్ర యూనిట్ సినిమాను మాత్రం ముందు అనుకున్న తేదీకే విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఈ చిత్రం తర్వాత ఎవరి డైరెక్షన్లో చేస్తాడా అనే ప్రశ్న కొనసాగుతుంది.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త వినిపిస్తోంది. అయితే హారికా అండ్ హాసిని బ్యానర్ తో పాటు కళ్యాణ్ రామ్ సొంత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ భాగస్వామ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుందని అంటున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత మరో నెల రోజులు సినిమా ప్రమోషన్ లో ఉంటాడు త్రివిక్రమ్. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా చేస్తాడని వినికిడి. మరి ఈ వార్త లో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.