//single page style gallary page

NTR Movie With Kalyan Ram Production

Category : movies

Click here to read this article in Telugu

మరోసారి కళ్యాణ్‌రామ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ..!

తెలుగు ఇండస్ట్రీ లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గానే కాక నిర్మాత గా కూడా నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కళ్యాణ్‌రామ్ తన సోదరుడు ఎన్టీఆర్‌తో మూవీ చేసేందుకు చాలా సంవత్సరాలుగా వెయిట్ చేశాడు. ఇక అప్పుడు బాబి దర్శకత్వంలో వచ్చిన జై లవకుశ సినిమాతో ఈ కోరిక తీరింది. ఒక విధంగా చెప్పాలంటే జై లవకుశ సినిమాకు ముందు కళ్యాణ్‌రామ్ చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడు. ఓం -త్రీడీ, కిక్ 2 లాంటి మూవీలు నిర్మాతగా కళ్యాణ్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి.

ఇక తాను హీరోగా తన బ్యానర్ మీద చేసిన సినిమాలు సైతం వరుసగా ప్లాప్ అవ్వడంతో కళ్యాణ్ కోలుకోలేనంత నష్టాల్లోకి వెళ్లిపోయాడు. ఆ టైం లో "జై లవకుశ" చిత్రం ఆ అప్పులన్నింటిని తీర్చేసింది. ఇక కళ్యాణ్ ఎన్టీఆర్‌తో మరో సినిమా ప్లాన్ చేసినా సరైన కథ దొరక్కపోవడం తో కళ్యాణ్ రామ్ ఆ ప్రయత్నాన్ని అప్పుడు విరమించుకున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం మైత్రీ వాళ్లు ఎన్టీఆర్ - కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఒక సినిమా ప్లాన్ చేశారు. కాగా ఇప్పుడు ఆ మూవీ లో కళ్యాణ్‌రామ్ పార్టనర్ షిఫ్ కోరాడట.

కానీ మైత్రీ వాళ్ల మధ్యే గ్యాప్ ఉందన్న ప్రచారం నడుస్తోంది కదా, ఇక అలాంటిప్పుడు మళ్లీ అందులోకి కళ్యాణ్‌రామ్ దూరితే ఉపయోగం ఉండదని కళ్యాణ్ కూడా కాస్త వెనక్కు తగ్గినట్టు సమాచారం. అయితే ఎన్టీఆర్ మాత్రం కళ్యాణ్ రామ్ కి ఇంకో దారి చూపిస్తున్నాడు. ఎన్టీఆర్. త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేసేది ఉంది. ఆ సినిమా నిర్మాణం లో కళ్యాణ్ రామ్ ని భాగస్వామి చేయాలి అని తారక్ నిర్ణయించుకున్నాడట. మరి త్రివిక్రమ్ సినిమా అంటే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీదే ఉంటుంది. అంటే ఇక ఇప్పుడు కళ్యాణ్ ఆ బ్యానర్‌తో కలిసి తన సోదరుడితో సినిమా నిర్మించాల్సి ఉంటుంది. మరి ఈ డీల్ సెట్ అవుతుందో ? లేదో? వేచి చూడాలి.

In Telugu industry, Nandamuri Kalyan is trying to make Ram stand out not only as a hero but also as a producer. Kalyanram waited many years to make a movie with his brother NTR . This was followed by Jai Lavakusha's film directed by Bobby. In other words, Kalyanram was in debt before Jai Lavakusha's film. Movies like Om-tridi and Kick2 have disappointed Kalyan as a producer.

Kalyan has gone through irreparable damage as his heroic banner films continue to plop. The film " Jai Lavakusha " in that time has settled all those debts. Kalyan Ram later pulled out of the venture as Kalyan was planning another film with NTR . However, a few days ago, Maithri had planned a film with NTR - KGF director Prashant Neel. Now, Kalyanram partner Shiff is asking for that movie.

But the friendship with them is a gap that is running the campaign, and will include such re-use is not going to squeeze kalyanram Kalyan also dropped some information back. But NTR is giving way to Kalyan Ram. NTR. There is also a movie with Trivikram. Tarak has decided to partner Kalyan Ram in the making of the film. And Trivikram Cinema means Banner of Haruka and Hasini Creations. This means that Kalyan will now have to make a film with his brother . And this deal is set? Whether or not? Have to wait.