Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"ఎన్టీఆర్ మహానాయకుడు" సినిమా రివ్యూ

Category : movies

మూవీ : ఎన్టీఆర్‌-మహానాయకుడు

నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, ఆమని, కల్యాణ్‌రామ్‌, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా, సచిన్‌ ఖేడ్కర్‌, సుప్రియ వినోద్‌, పూనమ్‌ బజ్వా, మంజిమా మోహన్‌, వెన్నెల కిషోర్‌, భానుచందర్‌, తదితరులు

మ్యూజిక్ : ఎం.ఎం.కీరవాణి

ఎడిటింగ్‌: అర్రం రామకృష్ణ

డైలాగ్స్ : బుర్రా సాయిమాధవ్‌

సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వీఎస్‌

నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి

దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

సంస్థ: ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా

విడుదల తేదీ: 22-02-2019

కథ:

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు, సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘మ‌హా నాయ‌కుడు’ వంతు వ‌చ్చింది. క‌థానాయ‌కుడిగా ఎన్టీఆర్ సాధించిన అపూర్వ విజ‌యాల‌కు తొలి భాగం ప‌ట్టం క‌డితే.. మ‌హా నాయ‌కుడిగా ఆయ‌న సాగించిన జైత్ర యాత్ర‌కు ‘మ‌హానాయ‌కుడు’ ప‌ట్టం క‌ట్టింది. మ‌రి రెండో భాగాన్ని క్రిష్ ఎంత స‌మ‌ర్థంగా తెర‌కెక్కించాడు...? నంద‌మూరి తార‌క రామారావుగా బాల‌కృష్ణ ఏ స్థాయిలో నటించాడు ...? చంద్రబాబు పాత్రలో రానా ఏవిధంగా ఆకట్టుకున్నారు.....? ‘మహానాయకుడు’తో ఎన్టీఆర్‌ జీవితం సంపూర్ణంగా ఆవిష్కృతమైందా...? లేదా అన్న ఆలోచనలు ప్రతి ఒక తెలుగు వాడిలో మిగిలి ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు వచ్చేసింది.

కథనం:

స్వర్గీయ ఎన్టీఆర్ సినిమా హీరో నుంచి .. రాజ‌నీయ నాయ‌కుడిగా ఎదిగే క్ర‌మంలో ఆయ‌న ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను అద్భుతంగా చూపించారు. అలాగే ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే క్ర‌మంలో చైత‌న్య ర‌థంలోనే ఉంటూ ప్ర‌చారం చేయ‌డం. రోడ్ల‌పైనే స్నానాలు చేయ‌డం ఇలాంటి స‌న్నివేశాల‌ను చ‌క్క‌గా చూపించారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో న‌టించిన రానా.. మామ‌కు ఎంత స‌హ‌కారం అందించారు. పార్టీ శ్రేణుల‌ను గ్రామాల్లో బ‌లోపేతం చేయ‌డానికి ఎలాంటి కృషి చేశారు. అనే అంశాల‌ను ఇందులో చూపించారు. అలాగే ముఖ్య‌మంత్రి గా ఎన్టీఆర్‌ అధికారంలోకి రాగానే చాలా ఆటంకాలు ఏర్ప‌డ్డాయి. తెలుగు గంగ ప్రాజెక్ట్‌తో త‌మిళ‌నాడుకు నీళ్లు అందించ‌డం. ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సుని త‌గ్గించ‌డంతో ఆయ‌న విమ‌ర్శ‌ల్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఆ ఉదంతాన్ని కూడా తెర‌పై చక్కగా చూపించ‌గ‌లిగారు. అవినీతి నిర్మూల‌నలో భాగంగా త‌న పార్టీ వాళ్లు ఉన్న కూడా ఆపేక్షించ‌క వారిపై చ‌ర్య తీసుకోవడం. ఈ క్ర‌మంలోనే వారిలో ఉన్న అసంతృప్తిని ఆస‌రాగా చేసుకుని నాదెండ్ల భాస్క‌ర్‌రావు.. ఎన్టీఆర్ చికిత్స కోసం యు.ఎస్‌లో ఉన్న‌ప్పుడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించుకోవ‌డం ..

నాదెండ్ల భాస్క‌రరావు న‌మ్మించి ఎలా మోసం చేశారు..? అధికార దాహంతో ఎన్టీఆర్‌ని సీఎం కుర్చీ నుంచి ఎలా దింపాల‌ని చూశారు...? అనేది అస‌లు క‌థ‌. ఆ కుట్ర‌లు, కుతంత్రాల నేప‌థ్యంలో ద్వితీయార్ధాన్ని ఆస‌క్తిదాయ‌కంగా మ‌లిచాడు క్రిష్‌. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్ర‌బాబు తెలుగు దేశం పార్టీలోకి ఎందుకు చేరారు.....? దానికి గ‌ల కార‌ణాలేంటి.....? నాదెండ్ల భాస్క‌ర‌రావు ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌కి ఎదురైన అవ‌మానాలు, ఎం.ఎల్.ఏల‌ను ఢిల్లీ కి తీసుకెళ్లి బ‌ల‌నిరూప‌ణ చేయ‌డం, ఇందిరాగాంధీ నియంతృత్వ విధానాల‌పై పోరాటం చేయ‌డం.. ఈ స‌న్నివేశాల‌న్నీ ర‌క్తిక‌ట్టిస్తాయి. ఈ సినిమా మొత్తం బ‌స‌వ‌తార‌కం కోణంలో సాగుతుంది. ఆమె మ‌ర‌ణమే.. ఎన్టీఆర్ క‌థ‌కు తుది అంకం.

ఎవరి నటన ఎలా ఉందంటే ...!

ఇక యంగ్ ఎన్టీఆర్‌గా కొన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న బాల‌కృష్ణ‌, పెద్ద ఎన్టీఆర్‌గా ఒదిగిపోయాడు. ముఖ్యంగా కొన్ని సీన్స్‌లో అయితే ఎన్టీఆర్‌నే చూస్తున్న‌ట్టు అనిపిస్తుంది. బ‌స‌వ‌తార‌కంగా క‌థానాయ‌కుడులోనే మంచి మార్కులు కొట్టేసిన విద్యాబాల‌న్ మ‌హానాయ‌కుడులో మ‌రోసారి సెటిల్డ్ న‌ట‌నతో ఆక‌ట్టుకుంది. చంద్ర‌బాబుగా రానా ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అవ్వ‌డ‌మే కాకుండా, కొన్ని సీన్ల‌లో హైలెట్ అయ్య‌డు. నాదెండ్ల బాస్క‌ర్ రావు క్యారెక్ట‌ర్‌ను మాత్రం అంద‌రూ ఊహించిన‌ట్టుగానే చూపించారు. ఇక మిగ‌తా పాత్ర‌లు వారి పరిదిమేర‌కు బాగానే చేశారు. ఫొటోగ్ర‌ఫీ, ఆర్ట్ వ‌ర్క‌, సంగీతం అన్నీ ఫ‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఇక అక్క‌డ‌క్క‌డా సీన్లు లాగ్ అయిన‌ట్టు అనిపించినా ఈ చిత్రం క‌థానాయ‌కుడు కంటే బాగానే ఉంద‌ని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :

బాల‌య్య-విద్య బాలన్ న‌ట‌న‌

కీర‌వాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్

ఎమోష‌న‌ల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

ఆక‌ట్టుకోని స్క్రీన్‌ప్లే

క్లైమాక్స్

రేటింగ్ : 3/5

గమనిక : ఈ సినిమా రివ్యూ ప్రేక్షకుడి ద్రుష్టి కోణం నుంచే మాత్రమే ఇవ్వడం జరిగింది. వ్యక్తి గతంగా కాదు.

Related News