//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' రివ్యూ

Category : movies

మహానటుడు దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ భార్య పాత్రలో విద్యాబాలన్ నటించింది. అయితే ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల నుంచి నందమూరి కుటుంబం వరుకు ఎంత ఎదురు చూసారు అనేది మాటల్లో చెప్పలేని విషయం. ఇప్పుడు అందరూ ఎదురు చుసిన సమయం వచ్చేసింది. ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా రివ్యూ ఏంటో చూసెయ్యండి మరి.

ఎన్టీఆర్ భార్య 'బసవ తారకం' పరిచయంతో సినిమా మొదలవుతుంది. ఆమె ఎన్టీఆర్ ఆల్బమ్‌ ను చూస్తుండగా అసలు కథ ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ రిజిస్టర్‌ ఆఫీస్‌లో మంచి ఉద్యోగం వచ్చినా అక్కడి పరిస్థితులు నచ్చక చేరిన మూడు వారాల్లోనే ఉద్యోగం మానేసి సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. గతంలో రామారావు వేసిన నాటకం చూసిన ఎల్వీ ప్రసాద్‌ సినిమా అవకాశం ఇస్తాననటంతో ఆయన్ను కలిసేందుకు మద్రాస్‌ బయల్దేరుతాడు. అలా మద్రాసు చేరిన ఎన్టీఆర్ సినీ ప్రయాణం ఎలా మొదలైంది. మొదట్లో నటుడిగా ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులేంటి అనే వాటిని చక్కగా చూపిస్తారు. అక్కినేని నాగేశ్వర్ రావుతో ఆయన అనుబంధం. వెండితెరలో ఎన్టీఆర్‌ ఎదిగిన తీరు. ఆయన్ని రాజకీయాలవైపు నడిపించిన పరిస్థితులే సినిమా కథ.

సినిమా అంతా ఎన్టీఆర్‌ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ప్రతీ ఫ్రేమ్‌లో బాలయ్యే కనిపిస్తాడు. ఒక రకంగా నందమూరి అభిమానులకు ఇది పండగలాంటి సినిమా. అయితే ఎన్టీఆర్‌ యువకుడిగా ఉన్నప్పటి పాత్రలో బాలయ్య ఆకట్టుకునేలా లేడు అయితే నటన విషయంలో పాత్రలో ఒదిగిపోయారు. ఎన్టీఆర్ వయసయినా పాత్రలో బాలయ్య లుక్‌, పర్ఫామెన్స్‌ బాగుంది. సినిమాలో ఇంకో కీలక పాత్ర ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం. ఆ పాత్రకు విద్యాబాలన్ తన పర్ఫామెన్స్‌తో పాత్ర స్థాయిని ఎంతో పెంచింది విద్యాబాలన్‌. సినిమాలో కాస్త ఎక్కువ సేపు కనిపించే మరో పాత్ర ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమ్‌ రావుది. తమ్ముడిగా రాజా నటన మెప్పిస్తుంది. అక్కినేని పాత్రలో ఆయన మనవడు సుమంత్ జీవించాడనే చెప్పాలి. ఇతర పాత్రల్లో ఎంతో మంది హేమా లాంటి నటులు కనిపించారు. ప్రతీ ఒక్కరు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అయితే ఏ పాత్ర ఒకటి రెండు నిమిషాలకు మించి తెర మీద కనిపించదు.

దర్శకుడు 'క్రిష్‌' నందమూరి అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ 'కథానాయకుడు'ను తెరకెక్కించాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్యను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఎన్టీఆర్‌, బసవ తారకంల మధ్య వచ్చే సన్నివేశాలను తన స్టైల్‌లో ఎంతో ఎమోషనల్‌గా చూపించాడు దర్శకుడు. సినిమాకు తగ్గట్టుగానే కీరావాణి సంగీతాన్ని అందిచాడు. పాటలతో సంగీత సన్నివేశాల స్థాయిని పెంచాడు కీరవాణి. ఈ సినిమా రచయిత సాయి మాధవ్‌ మనసును తాకే మాటలతో మెప్పించాడు. ఈ సినిమాకు బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా చేసిన విషయం తెలిసిందే.

ప్లస్ పాయింట్స్

బాలయ్య, విద్యాబాలన్‌ నటన

ఎన్టీఆర్‌, బసవ రామ తారకంల మధ్య వచ్చే సన్నివేశాలు

సంగీతం

మాటలు

మైనస్ పాయింట్స్

ఫస్ట్‌ హాఫ్‌లో బాలకృష్ణ లుక్‌

సన్నివేశాలు సగదియ్యడం

సినిమా లెన్త్