//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమ్మకానికి ఎన్టీఆర్ ఇల్లు

Category : national

28 బజుల్లా రోడ్‌.. టీ నగర్‌.. చెన్నై..  దూర ప్రాంతాల నుంచి అక్కడకు తరలివెళ్లే అభిమానులకు ఆ ఇల్లు మరో తిరుపతి! అన్నగారి పట్ల అంతులేని అనురాగానికి అది చిరునామా. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అన్న నందమూరి తారక రామారావు నివాసం ఇప్పుడు అంగడి సరుకుగా మారింది. ఎన్నో అనుబంధాలు, మధుర జ్ఞాపకాలకు గుర్తుగా నిలిచిన చెన్నైలోని ఎన్టీఆర్‌ నివాసం కొనుగోలు చేసేవారి కోసం దీనంగా ఎదురు చూస్తోంది. బ్రోకర్‌ ఏలుమలై పేరు, సెల్‌ఫోన్‌ నెంబర్‌తో ఆ ఇంటి గేటుకు వేలాడుతున్న బోర్డు తెలుగు ప్రజల హృదయాలను కలచివేస్తోంది. ఎన్టీఆర్‌కు ఆ ఇంటితో అనుబంధం గురించి ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఓ వ్యక్తి అందించిన వివరాలు ఇవీ...

బెడ్‌రూం పక్కనే పిల్లల గది...ఎన్టీఆర్‌ నటుడిగా స్థిరపడిన తరువాత చెన్నై రంగరాజపురంలో ఓ చిన్న ఇంటిని కొనుగోలు చేశారు. ఆయన రాకతో ఆ వీధి ఎన్టీఆర్‌ స్ట్రీట్‌గా మారింది. అక్కడ ఉండగా ఒక కుక్కను పెంచుకుంటూ షూటింగ్‌ లేని సమయాల్లో దానితో గడిపేవారు.