//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ సీన్ లో తండ్రి హరికృష్ణ ని గుర్తు చేసుకుంటూ ఎమోషన్ అయిన ఎన్టీఆర్ ..!

Category : movies

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా గా నటిస్తున్న చిత్రం అరవిందసమేత వీరరాఘవ . ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా కాలం తరువాత మళ్ళీ ఫ్యాక్షనిస్ట్ గా కనువిందుచేయనున్నాడు . ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన పూజాహెగ్డే నటిస్తుంది .

అరవిందసమేత సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కనుంది . ఈ సినిమా పూర్తిగా రాయలసీమ నేపథ్యం లో తెరకెక్కించారని సమాచారం .

అసలు విషయానికొస్తే ఈ అరవిందసమేత సినిమాలో సినిమాకే చాలా కీలకమైన పాత్ర లో మెగా బ్రదర్ నాగబాబు ఎన్టీఆర్ కి తండి గా నటిస్తున్నాడంట , కానీ ఈ సినిమా లో నాగబాబు చనిపోతాడంట , ఈ సీన్ చేసేటపుడు ఎన్టీఆర్ తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యాడని , ఎంతసేపటికి కూడా ఆ పాత్ర లో నుండి బయటకి రాలేదు అని , యూనిట్ సభ్యులు వెళ్లి చుస్తే ఎన్టీఆర్ నిజంగానే ఉద్వేగానికి లోనై అలాగే తన తండ్రి ని గుర్తుకు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడని , ఆ సమయం లో ఎన్టీఆర్ ని చూసిన చిత్ర యూనిట్ అంతా ఆయనకి దైర్యం చెప్తూ , వారు కూడా కంటతడి పెట్టుకున్నారని తెలుస్తుంది .