Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇక్కడ ప్లాప్ డైరెక్టర్స్ కి బ్లాక్ బాస్టర్స్ ఇవ్వబడును..

Category : movies

ఏ రంగంలోనైనా విజయాలు సాధించేవారి చుట్టూతా, బెల్లం చుట్టూతా ఈగలు వాలినట్టు వాలుతుండటం సర్వసాధారణం. ఇక విజయాలు లేని వారి ముఖం కాదుకదా వారి పేరు తలవడం కూడా ఇష్టపడరు. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ఎక్కువగా ఉంటుంది. ఒకప్పడు బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ వారు పొరపాటున ఒక డిజాస్టర్ మూవీ ఇస్తే హీరోస్ వారి పేరు తలవడానికి కూడా ఇష్టపడరు. ముఖ్యంగా మన టాలీవుడ్ టాప్ హీరోస్. కానీ ఓ టాప్ హీరో గత కొన్ని సంవత్సాలుగా ట్రెండ్ మార్చి ఎవరైతే డిజాస్టర్ మూవీస్ తీసి ఉన్నారో వారిని తన తుదుపరి చిత్రం డైరెక్టర్ గా ఎంచుకొని బ్లాక్ బాస్టర్స్ గా మలుచుకుంటున్నారు. తనకే కాకుండా, తన డైరెక్టర్ ని హిట్ ట్రాక్ ఎక్కిచ్చే పనిలో ఉంటున్నాడు ఆ హీరో. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నాడు మీకు అర్ధమయ్యే ఉంటది. అయన ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ఈ తారక రాముడు గత అయిదు చిత్రాలు తీసుకుంటే ప్రతి చిత్రం బ్లాక్ బాస్టర్ గా మలుచుకున్నాడు. ఈ అయిదు బ్లాక్ బాస్టర్స్ తీసిన డైరెక్టర్స్ లో నలుగురు డైరెక్టర్స్ అంతకముందు డిజాస్టర్ సినిమాలు తీసినవారే. వారు ఎవరో, వారు తీసిన సినిమాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం.

పూరి జగన్నాద్


2014 లో నితిన్ హీరోగా తన సొంత బ్యానర్ లో డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎన్నో భారీ అంచనాల నడుమున తీసిన చిత్రం హార్ట్ ఎటాక్. కానీ ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చలేదు. దీనితో ఈ చిత్రం ఘోర పరాజయం చెందింది. ఈ చిత్రంతో పూరి కేరీర్ డైలమాలో పడిపోయింది. దీనితో టాప్ హీరోస్ కూడా పూరీని ప్రక్కన పెట్టారు. ఆ టైములో ఎన్టీఆర్ నేనున్నారు అంటూ తన ఆస్థాన రైటర్ వక్కంతం వంశి చేత టెంపర్ లాంటి కథని పూరి చేతిలో పెట్టి అటు పూరికి ఇటు ఎన్టీఆర్ కి మళ్ళి హిట్ ట్రాక్ లోకి వచ్చారు.

సుకుమార్


2014 లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో 14 రీల్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య విడులై ఇటు మహేష్ అటు సుకుమార్ కెరీర్ లోనే బిగెస్ట్ డిజాస్టర్ గా నిలిచినా చిత్రం 1 -నేనొక్కడినే. ఒక్కప్పుడు సుకుమార్ ని క్రియేటివ్ డైరెక్టర్ అంటూ పొగిడిన టాప్ హీరోస్ ఆయనని ప్రక్కన పెట్టాశారు. అయన టైంలోనే టెంపర్ లాంటి విభిన్న చిత్రం చేసి మంచి ఊపు మీద ఉన్న ఎన్టీఆర్ డిజాస్టర్ లాంటి సినిమా తీసిన సుకుమార్ కి "నాన్నకు ప్రేమ తో " లాంటి సాహసపూరితమైన కధాంశంతో హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చాడు. కొసమెరుపు ఏమిటంటే ఎన్టీఆర్ కి ఎప్పుడు నుంచో అందని ద్రాక్ష లా ఉన్న ఓవర్శిస్ లో ఈ సినిమా కలక్షన్ల ప్రభంజనం సృష్టించి ఎన్టీఆర్ ఫాన్స్ కోరికను తీర్చడంతో పాటు మంచి ఫీల్ ఉన్న సినిమాగా ప్రశంసలు అందుకున్నాడు సుకుమార్.

డైరెక్టర్ బాబీ


2016 లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశలు పెట్టుకుని తన స్నేహితుడితో కలిసి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తీసిన మొదటి చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. హిట్స్ ని మరిచిపోయి తన గత పదేళ్లుగా ప్లాప్ సినిమాలు తీస్తూ తన అభిమానులని నిరాశ పరుస్తూ వస్తున్నా టైంలో గబ్బర్ సింగ్ లాంటి రీమేక్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన తన అభిమాని హరీష్ శంకర్ ని కాదని, రవి తేజ తో పవర్ లాంటి సినిమా తీసిన డైరెక్టర్ బాబీ కి దర్శకత్వ బాధ్యతని అప్పచెప్పాడు. ఇక బాబీ కూడా తన రెండొవ చిత్రమే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తో రావటంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ చిత్రం ఫలితం మాత్రం డిజాస్టర్ అయ్యుంది. దీనితో బాబీతో తమ తుదుపరి చిత్రం వస్తుందంటూ ప్రకటించిన మెగా హీరోస్ మొఖం చాటేశారు. ఇక దీనితో బాబీ కేరీర్ డైరెక్టర్ గా సమాప్తం అనే టైములో మూడు విభిన్న పాత్రలతో కూడిన జై లవ కుశ కధని ఎన్టీఆర్ కి వినిపించాడు. ఎన్టీఆర్ కూడా బాబీ గత చిత్రాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కధని నమ్మి తన అన్న బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో మొదటి చిత్రం చేసి తిరుగులేని విజయాన్ని అందించాడు. ఇటు అన్నకు ఆర్ధికంగా అటు బాబీ కి డైరెక్టర్ గా నిలదొక్కుకునేలా చేసాడు ఈ తారక రాముడు.

త్రివిక్రమ్

మాటల మాంత్రికుడిగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్. పవన్ కళ్యాణ్ తో తీసిన జల్సా, అత్తారింటికి దారేది.. చిత్రాలు మంచి హిట్స్ సాధించాయి. అప్పటి నుంచి వీరి కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ గా ఫాన్స్ భావించారు. మూడో చిత్రంగా వీరి కాంబినేషన్ ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అజ్ఞాతవాసి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ముఖ్యం గా గురూజీ నుంచి వచ్చిన చిత్రం ఏంటి ఇలా ఉంది అంటూ ఫాన్స్ తలలు పట్టుకున్నారు. ఆ టైములో ఎన్టీఆర్ త్రివిక్రమ్ మధ్య సినిమా అంటూ వార్తలు రావడంతో కొందరు వాటిని కొట్టిపారేశారు. వరుసగా నాలుగు బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్న ఎన్టీఆర్ ప్లాప్ డైరెక్టర్ తో సినిమా తీయడం అవసరమా అని కొందరు పెదవి విరిసారు. ఈ విమర్శలన్నటికి చెక్ పెట్టి ఎన్టీఆర్ తన సినిమా త్రివిక్రమ్ తో అంటూ ప్రకటించడమే కాకుండా శరవేగంగా షూటింగ్ జరిపించి, తన తండ్రి మరణాన్ని కూడా దిగమింగుకుని ఎంతో కసి, పట్టుదలతో నిర్మాతలకి ఎంటువంటి నష్టాన్ని కలగకుండా ప్రేక్షకులకి మరియు అభిమానులకి దసరా కానుకగా ఒక బ్లాక్ బాస్టర్ కన్నా మించిన ఓ భారీ విజయాన్ని ఇండస్ట్రీకి అందించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దసరా కానుకగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి రిలీజ్ అయినా అరవింద సమేత భారీ వసూళ్లతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది.

Related News