//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ అభిమానులు పండ‌గ చేసుకునే న్యూస్‌..!

Category : movies

సినీ ఇండ‌స్ట్రీ న‌టరుద్ర‌డు ఎన్టీఆర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబోలో తొలిసారిగా తెర‌కెక్కుతున్న చిత్రం అర‌వింద స‌మేత వీర రాఘ‌వ. ఇప్ప‌టికే ఈ చిత్రం రిలీజ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్ల‌ను సిద్ధం చేసుకుంది. ఆఖ‌రికి సెన్సాబోర్డు స‌భ్యులు ఈ చిత్రానికి యూ బై ఏ స‌ర్టిఫికేట్‌ను కూడా ఇచ్చేశారు.

అంతేకాకుండా, తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ‌వుతుంది. ఏపీలో ఈ చిత్రానికి మ‌రో అడ్వాన్టేజ్ ల‌భించింది. రోజుకు నాలుగు షోల‌కు బ‌దులుగా, ఐదు షోలు వేసుకునే వెసులుబాటు వ‌స్తుంద‌ని ట్రేడ్ విశ్లేష‌కులు భావించిన‌ప్ప‌టికీ పండుగ సెల‌వులు ఉండ‌టంతో రోజుకు ఏకంగా ఆరు షోల‌ను వేసుకునే వెసులుబాటును ప్ర‌భుత్వం ఈ సినిమాకు క‌ల్పించింది.

ఉద‌యం 5 గంట‌ల‌కు, అలాగే, 11 గంట‌ల‌కు ఎక్స్‌ట్రా షోల‌ను వేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించ‌డంతో మొత్తం మీద రోజుకు ఆరు షోల‌తో న‌డ‌వ‌బోతుంది అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా. అక్టోబ‌ర్ 11 నుంచి 18వ తేదీ వ‌ర‌కు వారం రోజుల‌పాటు కొన‌సాగ‌నున్న ఈ ఆరు రోజుల అడ్వాన్టేజ్‌తో సినిమా క‌లెక్ష‌న్లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక తెలంగాణ ప్రాంతానికి గాను ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అప్టేడ్ లేక‌పోవ‌డంతో కేవ‌లం టిక్కెట్ హైక్స్‌తోనే ఇక్క‌డ స‌రిపెట్టుకోవాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని చెప్పాలి. చాలా ఏరియాల్లో స్పెష‌ల్ షోలు లేక‌పోవ‌డం, కేవ‌లం రెగ్యుల‌ర్ షోల‌తోనే సినిమా రిలీజ్ అవుతుండ‌టంతో నైజం ఏరియాకి గాను సినిమా ఏ రేంజ్‌లో వ‌సూళ్ల‌ను రాబ‌డుతుందో అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. మిగిలిన పెద్ద సినిమాల‌తో పోల్చుకుంటే, నైజాం ఏరియాలో ప్ర‌స్తుతానికైతే అర‌వింద స‌మేత‌కు రోజుకు ఐదు షోలు వేసుకునే వెసులుబాటు మాత్రం ద‌క్క‌లేదు. ఏపీలో మాత్రం రోజుకు ఆరు షోలు వేసుకునే ఛాన్స్ ద‌క్క‌డంతో క‌చ్చితంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌లెక్ష‌న్లు ఓ రేంజ్‌లో వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి, ఈ అడ్వాన్టేజ్‌ను చిత్ర బృందం ఎంత మేర ఉప‌యోగించుకుంటుందో అన్న‌ది ఇప్పుడు అంద‌రిలోనే ఆస‌క్తిరేపుతున్న ప్ర‌శ్న‌.