//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఇదే...

Category : movies

త్రివిక్రమ్ దర్శకత్యం లో యుంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అరవింద సమేత వీరరాఘవ. హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆడియోఫంక్షన్ ఈ నెల 23 న జరగనుంది. అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ 13 న ప్రపంచమంతా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే, అదేవిధంగా జగపతి బాబు, నాగబాబు కూడా ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఫైట్ 15 నిముషాలు ఉంటుందంట. ఈ ఫైట్ ఒక రేంజ్ లో ఉందని, తెలుగు సినీ చరిత్రలో ఇలాంటి ఫైట్ సీన్ ఇప్పటివరకు లేదని ఫిలింనగర్ టాక్. అదేవిధంగా ఇంకో వార్త కూడా టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ ఎంట్రీ ఫైట్ సీన్ లో నాగబాబు చనిపోతాడంట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రిగా నాగబాబు నటిస్తున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాగబాబు చనిపోయిన తరువాత ఎన్టీఆర్ చేసిన నటన చూసి త్రివిక్రమ్ బయపడ్డాడంట.

ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనే ఈ చిత్రంలో ఉండటంతో, తనని గుర్తు చేసుకొని ఎన్టీఆర్ ఈ సీన్ ని పండిచాడని, ఇదే ఈ చిత్రానికి, ఎన్టీఆర్ నటనకి నిదర్శనమని ఫిలింనగర్ టాక్. అయితే ఈ సినిమాలో విలన్ గా జగపతి బాబు నటిస్తున్నాడు. ఈ చిత్రంలో జగపతి బాబు గొంతుపోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ మరియు ఫైట్ సీన్ 15 నిముషాలు ఉండటంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు