//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నాన్ బాహుబ‌లి రికార్డ్‌ను బ‌ద్ద‌లు కొట్టిన ఎన్టీఆర్‌..!

Category : movies

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌స్తున్న లేటెస్ట్ మూవీ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌. ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల‌తోపాటు, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియా, ఓవ‌ర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా రికార్డు లెవ‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.

అయితే, ఇటీవ‌ల సినిమా థియేట్రిక‌ల్ టైల‌ర్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అద్భ‌త‌మైన రికార్డుల‌తో తొలి 24 గంట‌ల్లో స‌రికొత్త బెంచ్ మార్క్‌ల‌ను సెట్ చేసిన ఈ ట్రైల‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనూ మ‌రిన్ని అద్భుతాల‌ను సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే కాకుండా, టాలీవుడ్ హిస్ట‌రీలో అత్య‌ధిక వ్యూస్‌ను సొంతం చేసుకున్న ట్రైల‌ర్స్‌లో ఒక‌టిగా నిలిచిన జై ల‌వ కుశ త‌రువాత‌.. ఇప్పుడు అర‌వింద స‌మేత వీర రాఘ‌వ చిత్రం అత్య‌ధిక లైక్స్‌ను సొంతం చేసుకుని సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.

బాహుబ‌లిని ప‌క్క‌న పెడితే, మొట్ట మొద‌టి మూడు ల‌క్ష‌ల లైక్స్‌ను సొంతం చేసుకున్న టైల‌ర్‌గా నిలిచిన అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. తాజాగా, 4 ల‌క్ష‌ల లైక్స్‌ను అదిగ‌మించి స‌రికొత్త రికార్డును న‌మోదు చేసింది. అలాగే, 13 మిలియ‌న్ల వ్యూస్‌ను సొతం చేసుకుంది. ఓవ‌రాల్‌గా తొలి 24 గంట‌ల్లో ఆల్‌టైమ్ రికార్డును న‌మోదు చేసిన త‌రువాత ఫాటెస్ట్ 10 మిలియ‌న్ వ్యూస్‌ను, ఇప్పుడు ఆల్‌టైమ్ హైయ్యెస్ట్ లైక్స్‌ను సాధించిన ట్రైల‌ర్‌గా నిలిచి.. నాన్ బాహుబ‌లి రికార్డును సృష్టించింది ఈ ట్రైల‌ర్‌.