//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒకేరోజు రిలీజ్ అయితే మొదటిగా ఏ సినిమా చూస్తారు ...

Category : movies

ప్రస్తుతం టాలీవుడ్ లో బయో పిక్స్ ట్రెండ్ నడుస్తుంది . మహానటి సావిత్రి గారి జీవితం ఆధారంగా తెరకెక్కించిన మహానటి సినిమా టాలీవుడ్ లో మరో చరిత్ర తిరగరాసింది . అప్పటివరకు బయో పిక్స్ తీస్తే చూస్తారో లేదో అనుకుంటున్నా తెలుగు డైరెక్టర్స్ కి ఊపు తెచ్చే విధంగా మహానటి కి తెలుగు సినీ అభిమానులు బ్రహ్మ రథం పట్టారు . దీనితో తెలుగు డైరెక్టర్స్ కూడా బయో పిక్స్ ని తెరకెక్కించటం లో బిజీ అయ్యారు .

ఇందులో భాగంగా గానే స్వర్గీయ నటుడు , మాజీ సీఎం , ఆంధ్రుల ఆరాధ్య , అన్నగారు అని ఎంతో ప్రేమ గా పిలుచుకునే ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు . ఇందులో ఎన్టీఆర్ పాత్రలో నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్నాడు . ఈ సినిమా మొత్తం భారీ తారాగణం తో రూపొందుతుంది . ఎన్టీఆర్ పుట్టినప్పటి నుండి స్వర్గస్తులయ్యేవరకు జరిగిన అన్ని ప్రధానమైన ఘట్టాలని చూపించబోతున్నారని సమాచారం . ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు . ఈ ఎన్టీఆర్ బయో పిక్ వచ్చే సంక్రాంతికి తెలుగు ప్రజల ముందుకు రానున్నది.

ఇక పొతే ఏపీ మాజీ సీఎం , స్వర్గీయ dr . రాజశేఖర్ రెడ్డి బయో పిక్ ని కూడా తెరకెక్కిస్తున్నారు . అయన జీవితం లో ఎంతో ప్రధానమైన పాదయాత్ర నే కథ గా చేసుకొని , యాత్ర పేరు తో రూపొందిస్తున్నారు . ఇందులో రాజశేఖర్ రెడ్డి పాత్ర లో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు . బయోపిక్ అని చెప్పి అయన జీవితాన్ని పూర్తిగా కాకుండా పాదయాత్ర నుండి ప్రారంభించటం ఎవరికీ అంతగా నచ్చటం లేదు . ఇక పొతే ఈ రెండు సినిమాలకోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు . ఈ రెండు సినిమాలు ఒకే రోజు అభిమానుల ముందుకు వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ బయోపిక్ గట్టగా నిలబడుతుంది అనే మాట ఎక్కువుగా వినిపిస్తుంది , ఎన్టీఆర్ కి రాజకీయంగా కానీ . సినీ పరంగాకాని ఎనలేని కీర్తి ఉంది , అలాగే ఈ సినిమాలో టాలీవుడ్ లోని భారీ తారాగణం మొత్తం నటిస్తుండడం మరో విషయం . మొత్తం మీద చూస్తే ఈ రెండు సినిమాలు ఒకరోజు రిలీజ్ అయితే కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ బయోపిక్ టాప్ ప్లేస్ ఉంటుందని తెలుస్తుంది .

#YatraMovieLatestUpdates #NTRBioPic #latestTeluguCinemaUpdates