//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ బయోపిక్.....చేతులెత్తేసిన బాలకృష్ణ...!

Category : movies

ఎన్టీఆర్ బయో పిక్ ను నందమూరి బాలకృష్ణ ఎంతో గ్రాండ్ గా మొదల పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇంత వరకు ఆ సినిమా గురించిన ఏ విషయం బయటికిరాలేదు. పైగా ఆ సినిమా డైరెక్టర్ తేజ తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా బయో పిక్ ఎలా ఉండాలనేది మహానటి మూవీ చూపించింది. ఎంతో హానెస్ట్ గా చూపించాలి.

ప్రతి ఫ్రేమ్ గుండెలకు హత్తు కోవాలి. చరిత్ర ను చరిత్ర లా చూపించాలి కానీ ఎన్టీఆర్ బయో పిక్ ను ఇంకోలా తీద్దామని బాలయ్య ఇప్పటి వరకు అనుకున్నాడు. ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నట్టున్నాడు.బాలయ్య, ఎన్టీఆర్ బయోపిక్ ను మరోలా తీయాలని ముందుగా అనుకున్నాడు.

ఎన్టీఆర్ గారు వేసిన ఓ 60గెటప్స్ ను సినిమాలో చూపించేయాలని బాలయ్య ఫిక్స్ అయ్యాడు. తేజ తప్పుకున్నది కూడా ఈ వ్యవహారం నచ్చకే. ఇప్పుడు మహానటి సినిమా వచ్చిన తర్వాత, ఎన్టీఆర్ బయోపిక్ పై ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారనే విషయంపై బాలయ్యకు ఓ క్లారిటీ వచ్చినట్టుంది.

అందుకే మరింత రీసెర్చ్ కోసం సినిమాను పక్కన పెట్టాడు. తనే మెగాఫోన్ పట్టుకొని డైరక్ట్ చేద్దామనుకునే ఆలోచన నుంచి కూడా వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అలా ఓపెనింగ్ జరిగి, సెట్స్ పైకి రాకుండానే ఆగిపోయింది ఎన్టీఆర్ బయోపిక్. చూడాలి మరి ఏ సినిమా మల్లి పట్టాలెక్కుతుందో లేక నర్తనశాల లాగా చరిత్రలో మిగిలిపోతుందో కాలమే నిర్ణయిన్చాలి.