//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నైజాంలో బాహుబ‌లి రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌నున్న ఎన్టీఆర్‌..!

Category : movies

2018 సెకాండాఫ్‌లో సినీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబోలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రం విడుద‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. అన్ని ఏరియాల్లోనూ అద్దిరిపోయే రేంజ్‌లో ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం నిర్ణ‌యించింది. అందుకు త‌గ్గ ఏర్పాట్ల‌ను కూడా ఇప్ప‌టికే పూర్తి చేసింది.

అందులో భాగంగా, నైజాం ఏరియాకి గాను, ఎన్టీఆర్ కెరీర్‌లోనే రికార్డు లెవ‌ల్లో రిలీజ్‌ను సొంతం చేసుకోనుంది. ప్ర‌స్తుతానికి నైజాం ఏరియాకిగాను మొద‌టి చాట్‌ను రిలీజ్ చేయ‌గా ఓవ‌రాల్‌గా ప్ర‌స్తుతానికి థియేట‌ర్లు 270 వ‌ర‌కు రిలీజ్ చేశారు. అయితే, చిత్రం రిలీజ్ స‌మ‌యానికి ఈ లెక్క 400ల‌కు పైగా థియేట‌ర్ల‌ను సొంతం చేసుకోనుంద‌ని స‌మాచారం.

ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే కాకుండా, టాలీవుడ్ హిస్ట‌రీలోనూ వ‌న్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజ్ సినిమాల‌లో ఒక‌టిగా చెప్పుకోవ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ న‌టించిన సినిమాల‌లో జ‌న‌తా గ్యారేజ్ 380కి పైగా థియేట‌ర్ల‌లో రిలీజ్ అవ‌గా, త‌రువ‌త వ‌చ్చిన జై ల‌వ కుశ సినిమా 350కి పైగా థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. ఇక హ‌య్యెస్ట్ థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన సినిమాల్లో బాహుబ‌లిని ప‌క్క‌న పెడితే, అజ్ఞాత‌వాసి 420 థియేట‌ర్ల‌లోను, రంగస్థ‌లం సినిమా 320 థియేట‌ర్ల‌లోనూ, భ‌ర‌త్ అనే నేను 320 థియేట‌ర్ల‌లోను రిలీజ్ అయింది. ఆ సినిమాల‌తో పోల్చుకుంటే, భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న అర‌వింద స‌మేత వీర రాఘ‌వ బాక్సాఫీసు వ‌ద్ద ఇప్పుడు ఎలాంటి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటుందో..? అన్న‌ది ఆస‌క్తిగా మారింది.