//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీజర్ రిలీజ్ పోస్టర్ తో కుమ్మేసిన ఎన్టీఆర్.....!

Category : movies

టీజర్ రిలీజ్ పోస్టర్ తో కుమ్మేసిన ఎన్టీఆర్.....!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం అరవిందసమేత టీజర్ ఆగస్టు 15 కానుకగా రిలీజ్ చేయనున్నారని చిత్ర యూనిట్ ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అలాగే ఒక స్టిల్ ని కూడా రిలీజ్ చేసారు.

ఈ స్టిల్ లో ఎన్టీఆర్ కుర్చీలో కూర్చొని ఉండగా, కుర్చీ మధ్యలో ఎవరో పడిపోయి ఉన్నారు. దీనిని చూస్తుంటే ఎన్టీఆర్ మరో సారి ఈ సినిమాలో తన విశ్వరూపం చూపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో నాగబాబు , జగపతిబాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ఈ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో, హారిక హాసిని బ్యానర్ పై తెరకెక్కుతుంది. ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతం ఇస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Related News