//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్టీఆర్ వ‌సూళ్ల సునామీ.. రెండు రోజుల్లోనే రూ.75 కోట్లు..!

Category : movies

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర రాఘ‌వ మొద‌టి రోజు మొత్తం మీద 37 కోట్ల‌కుపైగా షేర్‌ను వ‌సూలు చేసి సంల‌నం సృష్టించ‌గా రెండ‌వ రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్దిరిపోయే లెవ‌ల్లో ఈవెనింగ్ అండ్ నైట్ షోల‌లో క‌లెక్ష‌న్ల‌ను సాధించిన ఈ సినిమా ఓవ‌రాల్‌గా రెండ‌వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 85 కోట్ల షేర్‌ను అందుకున్న‌ట్టు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా 10 కోట్ల రేంజ్‌లో షేర్‌ను వ‌సూలు చేయ‌డం ఖాయం క‌నిపిస్తుంది. దాంతో రెండ‌వ రోజు మొత్తం మీద ఈ సినిమా గ్రాస్ ప‌రంగా అవ‌లీల‌గా 19 కోట్లు నుంచి 20 కోట్లు వ‌ర‌కు గ్రాస్‌ను వ‌ర‌ల్డ్ వైడ్‌గా అందుకోవ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

దాంతో రెండు రోజుల టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 75 కోట్లును అధిగ‌మించిన‌ట్టు స‌మాచారం. ఎన్టీఆర్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెన‌ర్‌గా నిలిచిన ఈ సినిమా టాలీవుడ్ హిస్ట‌రీలోనే సంచ‌ల‌నం సృష్టించింది. ఈ చిత్రం టిక్కెట్ల రేట్లు భారీగా ఉన్న‌ప్ప‌టికీ ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఈవెనింగ్ షోల‌కు భారీగా త‌ర‌లివ‌స్తుండ‌టంతో శని, ఆది వారాల‌లో ఈ సినిమా క‌లెక్ష‌న్ల ప్ర‌కారం దుమ్ము లేప‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ ద‌స‌రా వ‌ర‌కు క‌చ్చితంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ విశ్లేష‌కులు భావిస్తుండ‌గా, ఓవ‌రాల్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో స‌గం వ‌ర‌కు బిజినెస్‌ను రెండు రోజుల్లోనే సొంతం చేసుకోవ‌డం విశేష‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.