//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బయోపిక్ లో బాలకృష్ణ గా ఎన్టీఆర్....!

Category : movies

నందమూరి హీరోల్లో ఎన్టీఆర్ తరువాత అంతటి పేరు తెచ్చుకున్నవారు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు మాత్రమే. ఇప్పుడు టాలీవుడ్లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. ఈ తరుణంలో ఎన్టీఆర్ బయోపిక్ ని బాలకృష్ణ తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాకి డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలక్రిష్ణ హీరోగా , నిర్మిస్తున్న ఈ చిత్రం ఫై యావత్ తెలుగు ప్రేక్షకులు , ప్రజలు ఎంతో ఆసక్తి గా ఉన్నారు. వారి ఆసక్తి తగ్గట్లే సినిమాను తెరకెక్కిస్తున్నారు క్రిష్. ఇంకా ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటులు నటిస్తున్నారని సమాచారం.

చంద్రబాబు నాయుడు పాత్ర కోసం రానా, బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ నటి విద్యా బాలన్, హరికృష్ణ పాత్ర కోసం కళ్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వరరావ్ పాత్ర కోసం సుమంత్ ను తీసుకోగా ఇక బాలకృష్ణ పాత్ర కోసం ఎన్టీఆర్ ను తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నాడని తెలిసింది.

ఎందుకంటే బాలకృష్ణ లోని రాజసం, ఆయనలా లెంగ్తీ డైలాగ్స్ చెప్పే నైపుణ్యం, బాడీలో ఎనర్జీ, డ్యాన్సుల్లో గ్రేస్ వంటి క్వాలిటీలన్నీ ఎన్టీఆర్ లో ఉంటాయి కాబట్టి ఆ పాత్ర కు ఆయనైతేనే న్యాయం చేస్తారని క్రిష్ భావిస్తున్నారట. చూడాలి మరి తన బాబాయ్ రోల్ పోషించటానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.....

Related News