//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నవంబర్ 8 బ్లాక్ డే

Category : national

నల్లధనం వెలికితేయడానికే 500, 1000 నోట్లు రద్దు చేసాను, కేవలం 50 రోజుల్లో ప్రతి పేదవాడి జన్ ధన్ ఖాతాలో 15లక్షల రూపాయిలు వేస్తాను, మన దేశ ఆర్ధిక ఇబ్బందులు తొలగిస్తాను అని ప్రజలని నమ్మించి సరిగ్గా నవంబర్ 8వ తేదీకి సంవత్సరం గడిచింది. కార్పొరేట్ వ్యక్తులు దోచుకుని దాచుకున్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునే అవకాశం కల్పించిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ విధానానికి నిరసనగా ఈ నవంబర్ 8 వ తేదీన సిపిఐ, సిపిఎం పార్టీలు కలసి దేశవ్యాప్తంగా ఆ రోజున బ్లాక్ డే గ పాటించి నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చాయి, కావున 8వ తేదీన జరగబోయే నిరసన కార్యక్రమంలో ప్రజలు, మేధావులు, విద్యార్థులు, యువతీయువకులు, రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఉద్యోగులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ, సీపీఎం పార్టీలు కోరాయి.