//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చిరంజీవికి కోర్టు నోటీసులు !

Category : movies

సెలెబ్రిటీస్ గురించి ఒక్క చిన్న వార్త వచ్చినా అది వైరల్ అవడం సహజం.

అది నిజమా కాదా అనే విష్యం ఆలోచించరు తెగ షేర్లు, కామెంట్లు పెట్టి ఆ న్యూస్ ని వైరల్ చేసి నిజమే అనే భ్రమ కలిగిస్తారు. ఇప్పుడు తాజాగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అప్పటిలో చిరు చిన్న కూతురు శ్రీజ ఫ్యామిలీ కి ఇష్టం లేకుండా శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి దాంపత్యానికి గుర్తుగా ఒక పాప కూడా జన్మించింది.

ఎంతో ధైర్యంగా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఆ జంట ఆరు సంవత్సరాల పాటు కలిసి కాపురం చేసింది. ఆ తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరి మధ్య గొడవలు రావటంతో కోర్టు ద్వారా విడాకులు తీసుకుని చట్టబద్ధంగా విడిపోయారు. ఆ తర్వాత శ్రీజ కళ్యాణ్ కానుగంటి అనే ఎన్నారై ని రెండో వివాహం చేసుకుంది. విడాకులు అయితే కోర్టు ఇచ్చింది కానీ వీరిద్దరికి పుట్టిన పాప ఎవరికీ చెందాలో కోర్టు నిర్ణయించలేదు.

శ్రీజ మాత్రం పాపని నేనే పెంచుకుంటానని అనడంతో అప్పటికి ఆమెకే అప్పగించారు. అయితే ఈ విషయంపై శిరీష్ భరద్వాజ్ తన బిడ్డ తనకి కావాలంటూ చిరంజీవి ఇంటికి వెళ్లి అడిగాడట. దీనికి చిరంజీవి ఏ మాత్రం ఒపుకోలేదట. దాంతో శ్రీజ మాజీ భర్త శిరీష్ కోర్టును ఆశ్రయించి చిరంజీవికి,శ్రీ జకి లీగల్ నోటీసులు పంపాడట. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ అయింది. కానీ ఈ విషయం ఎంతవరకు నిజం అనేది చిరంజీవి ఫ్యామిలీ స్పందిస్తే కాని తెలియదు.