//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విఫల యత్నంగా మిగిలిపోయిన నోట్ల రద్దు !

Category : national

"లక్షల కోట్ల నల్లధనం దేశంలో మూలుగుతోంది. కరెన్సీనోట్లను పరుపుల కింద, గన్నీ సంచుల్లోనూ కూరుతున్నారు. నిజాయితీ పరులైన పౌరులు దీనిని ఎంత కాలం భరించాలి? అందుకే పెద్దనోట్లు రద్దు చేస్తున్నాం" అంటూ గత సంవత్సరం  ప్రధానమంత్రి నరేంద్రమోడీ అట్టహాసంగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు విఫల యత్నంగా మిగిలిపోయింది. ఈ  ప్రకటనలో నిర్ధేశించిన ఒక్క లక్ష్యాన్ని కూడా ఈ ప్రక్రియ చేరుకోలేదని స్పష్టం అవుతుంది.

రద్దు చేసిన నోట్లన్ని దాదాపుగా వెనక్కి వచ్చేసినట్లు తాజాగా రిజర్వుబ్యాంకు నివేదిక   స్పష్టం చేయడంతో కనీసం మూడు లక్షల కోట్ల రూపాయల `నల్లడబ్బు'  తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చిన్నట్లు ప్రధాని చేసిన ప్రకటన అర్ధం లేకుండా మిగిలిపోతుంది. రద్దయిన వెయ్యి రూపాయల నోట్లు 99శాతం వెనక్కి వచ్చాయని రిజర్వుబ్యాంకు తెలిపింది. 500 రూపాయల నోట్ల సంఖ్య విషయమై ఆర్‌బిఐ అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ ఆ నోట్లు కూడా దాదాపుగా మొత్తం బ్యాంకులకు చేరాయని చెబుతున్నారు. దీంతో నల్లధనం రద్దు ప్రహసనమేనని స్పష్టమైంది.

హడావిడిగా, ఆర్భాటపు ప్రకటనలతో తీసుకున్న ఈ చర్య ప్రజలకు, ముఖ్యంగా పేదలు, మధ్య తరగతి ప్రజలకు అంతులేని కష్టనష్టాలను, దేశానికి ఆర్థిక భారాన్ని మాత్రమే మిగిల్చిన్నట్లు అయింది. తొమ్మిది నెలలుగా రద్దయిన నోట్లు ఎన్ని తిరిగి వచ్చాయో చెప్పకుండా దాటవేస్తూ వస్తున్న ప్రభుత్వం చివరకు ఆర్బీఐ నివేదిక రూపంలో చెప్పక తప్పలేదు.

దేశానికి పెను సవాల్‌గా మారిన ఉగ్రవాదులకు నిధులు ఎక్కడ నుండి అందుతున్నాయో తెలుసా? సరిహద్దుల అవతల శత్రువులు దొంగనోట్లనుముద్రించి తెస్తున్నారు" అంటూ ప్రధాని చెబుతూ వచ్చారు. ఇప్పుడు పెద్దనోట్లన్నీ ఖజానాకు తిరిగిరావడంతో దొంగ డబ్బు లేకుండా అయినా ఉండాలి, లేకుంటే, మొత్తం దొంగసొమ్ము ప్రభుత్వంలోని పెద్దల అండతో ముందుగానే బ్యాంకులకు చేరి ఉండాలి.

గ‌తేడాది మోదీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన మొత్తం రూ 15.44 ల‌క్ష‌ల కోట్ల విలువైన పెద్ద నోట్ల‌లో 99 శాతం అంటే రూ 15.28 ల‌క్ష‌ల కోట్లు తిరిగి వ‌చ్చాయ‌ని ఆర్బీఐ నివేదిక‌లో వెల్ల‌డించింది. ర‌ద్ద‌యిన నోట్ల‌లోరూ 8900 కోట్ల విలువైన వెయ్యి నోట్లు మాత్ర‌మే రాకపోగా, కొత్త నోట్ల ముద్రణకు రూ 7,965 కోట్లు ఖర్చు చేసిన ఆర్బిఐ కి నికరంగా మిగిలింది ఏమీ లేదు. పైగా ఈ సంవత్సరం డివిడెంట్ ను ప్రకటించలేక పోయింది.

దీనిని బెర్టీ దేశంలో చెలామణిలో ఉన్న నల్ల డబ్బను కట్టడి చేయడం కోసం కాకుండా, దానిని తెల్ల డబ్బుగా చేసుకోవడానికి నోట్ల రద్దు ఉపయోగ పడినట్లు భావించ వలసి వస్తున్నది. ఇక ప్ర‌స్తుతం మార్కెట్‌లో చెలామ‌ణిలో ఉన్న నోట్ల‌లో కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన రూ 2000 నోట్ల విలువ మార్చి చివ‌రి నాటికి 50 శాతంపైనేన‌ని ఆర్బీఐ తెలిపింది. నోట్ల రద్దు జరిగిన కొద్ది రోజుల్లోనే రూ 2000 నకిలీనోట్లు చలామణిలోకి రావడం గమనిస్తే కేవలం కొత్తగా నల్లధనాన్ని పోగు చేసుకోవడం కోసమే ఆర్ధిక నిపుణుల సలహాలను పెడచెవిన పెట్టి ప్రభుత్వం రూ 2000 నోట్లను చెలామణిలోకి తెచ్చిన్నట్లు భావించ వలసి వస్తుంది.

ఈసారి మార్కెట్లో క‌రెన్సీ చెలామ‌ణి గ‌తేడాది కంటే 20.2 శాతం త‌గ్గింద‌ని కూడా రిజ‌ర్వ్ బ్యాంక్ వెల్ల‌డించింది. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం కేవ‌లం 1.2 శాతం మాత్ర‌మే ర‌ద్దు అయిన నోట్లు వెన‌క్కి రాలేదు అని తెలుస్తున్న‌ది. నోట్ల రద్దు వల్లన జిడిపి వృద్ధి రేట్ తగ్గడం, పారిశ్రామిక ఉత్పత్తులు పడిపోవడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, పలు ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లకు అంతరాయం కలగడం జరిగింది. మరో వంక నోట్ల మార్పిడి సందర్భంగా బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు స్పష్టం అయినా నిందితులపై ఎటువంటి చర్య తీసుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండిపోయింది.