//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నోట్ల రద్దుతో 15 లక్షల ఉద్యోగాలు ఫట్

Category : national

ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో  దేశ ఆర్ధిక వ్యవస్థపై చూపిన దుష్ప్రభావాలు ఒకొక్కటి  వెలుగులోకి వస్తున్నాయి. వృద్ధి రేటు తగ్గడం, పారిశ్రామిక ఉత్పత్తులు మందగించడం, రైతులు  ఆదాయం కోల్పోవడం వంటి వాటితో పాటు నాలుగు నెలలో  దేశంలో 15 లక్షల మంది ఉద్యోగాలను కొల్పోయారని తాజాగా వెలుగులోకి వచ్చింది. 

సెంటర్‌ఫర్‌ మానెటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సంస్థ(సిఎంఐఇ) జనవరి 2016 నుంచి ఏప్రిల్‌ 2017 వరకు దేశవ్యాప్తంగా 161617 ఇళ్లను సర్వే చేసి వివరాలు సేకరించింది. ఏప్రిల్‌ 2016లో దేశంలో ఉద్యోగులు 40.1 కోట్ల మంది ఉండగా, డిసెంబర్‌ నాటికి 40.65 కోట్లకు చేరారన్నారు. అయితే అనూహ్యంగా ఏప్రిల్‌ 2017 నాటికి ఆ సంఖ్య 40.5 కోట్లకు పడిపోయిందని తెలిపారు. 14 ఏళ్లు నిండి పనిచేసే సామర్థ్యం ఉన్న వారి సంఖ్య 2017 నాటికి భారీగా పెరిగిందన్నారు. అయితే 2017 జనవరి-ఏప్రిల్‌ మధ్య కాలంలో ఆశించినంతగా ఉద్యోగుల సంఖ్య పెరగలేదని నివేదిక స్పష్టం చేస్తోంది. ఆ మేరకు నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని ఆ సంస్థ అధినేత మహేష్‌ వ్యాస్‌ తెలిపారు. జనవరి-2016లో నిరుద్యోగ రేటు 4.7 శాతం ఉండగా, సెప్టెంబరు-డిసెంబరు నాటికి నిరుద్యోగ రేటు 6.8 శాతానికి పెరిగిందని చెప్పారు. 

మొత్తం 43.6 కోట్ల మంది కార్మికులుండగా వీరిలో 29.6 శాతం మంది కార్మికులకు ఉపాధి లభించలేదని నివేదిక తెలిపింది. సెప్టెంబరు-డిసెంబర్‌ నాటికి కొత్తగా 96 లక్షల ఉపాధి కోసం వెదికే పరిస్థితి వచ్చింది. ఏటా కొత్తగా ఉపాధి కోసం వచ్చే వారికి ఈ సంఖ్య ఇంచుమించు సమానంగా ఉంది. దీంతో అదే స్థాయిలో 2017 జనవరి- ఏప్రిల్‌ మధ్య కూడా నిరుద్యోగం పెరిగింది. ఈ సమస్యలను పరిష్కరించాలంటే దీర్ఘకాలిక వ్యూహాలు అనుసరించాలని నివేదికలో పేర్కొన్నారు.