//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

10 రోజుల యుద్దానికి 40 శాతం మందుగుండు సామగ్రి కొరత !

Category : national

ఒకవంక సిక్కిం సరిహద్దులో భారత్ - చైనా సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని  ఉంటె, చైనా సైన్యం యుద్దానికి రెడీ అంటూ కవ్వింపు చర్యలకు దిగుతూ ఉంటె, భారత  సైన్యం వద్ద  పది రోజుల పాటు యుద్దానికి అవసరమైన మందుగుండు సామాగ్రి కూడా పూర్తిగా లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. కాగ్ పార్లమెంట్ కు సమర్పించిన నివేదిక ప్రకారం  సెప్టెంబర్, 2016 నాటికి సైన్యం ఆయుధాగారంలో పది రోజుల యుద్దానికి అవసరమైన 152 రకాల మందుగుండు సామగ్రిలో 61 రకాలు అందుబాటులో లేవు.

2013 మార్చ్ నాటికి అయితే 170 రకాలలో సగం రకాలు అందుబాటులో లేవు. అన్నింటికన్నా ఆందోళన అంశం ఫిరంగులు పేల్చడానికి అవసరమైన ఫీజ్ ల నిల్వలు  సైన్యం వద్ద 83 శాతం కొరతగా ఉన్నాయి. అంటే సైన్యం తమ వద్ద ఉన్న యుద్ధంలో కీలక భూమిక వహించే ఫిరంగులలో 83 శాతం ఉపయోగించడం సాధ్యం కాదు.

ప్రభుత్వ ఉత్తరువుల ప్రకారం 40 రోజులపాటు తీవ్రమైన యుద్ధం చేయడానికి అవసరమైన సామగ్రి సైన్యం వద్ద ఉండాలి. అయితే  కాగ్ నివేదిక ప్రకారం 20 శాతం మాత్రమే సిద్ధంగా ఉన్నాయి. 152 రకాలలో 31 రకాలు మాత్రమే 40 రోజులకు సరిపడా ఉన్నాయి. 1999 లో 20 రోజులపాటు యుద్దానికి అవసరమైన కనీస అవసరాల మేరకు ఆయుధ సామాగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని మన సైన్యం నిర్ణయించింది. కాగ్ నివేదిక ప్రకారం 55 రకాల నిల్వలు కనీసం కన్నా తక్కువగా ఉన్నాయి.

పరిస్థితుల తీవ్రతను గ్రహించిన ప్రభుత్వం ఆర్మీ స్టాఫ్  వైస్ చీఫ్ కు అదనపు ఆర్ధిక అధికారాలు బదలాయించింది.  ఈ నెలలోనే 46 రకాల సామగ్రి, 10 రకాల విడి భాగాల కొనుగోలు అధికారాలు కల్పించారు. గత సెప్టెంబర్ నుండి మార్చ్ వరకు 10 రోజుల యుద్దానికి అవసరమైన రూ 11.000 కోట్ల విలువైన 11 రకాల సామగ్రి కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చారు. ఇప్పుడు మరో రూ 40 వేల కోట్ల విలువైన సామాగ్రికి ఆర్డర్లు ఇవ్వనున్నారు. అందుకు అదనపు నిధులను సమకూర్చవలసి ఉంది.