ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పెను విపత్తుకు కారణమయ్యేలా ఉన్నాడు. ఏదో ఒక ప్రాంతంలో అణు బాంబుతో దాడి చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. దీంతో అగ్రరాజ్యం అమెరికాకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఉత్తర కొరియా చేతిలో భారీ మొత్తంలో అణు బాంబులు ఉండటంతో వాషింగ్టన్ బెంబేలెత్తిపోతున్న విషయం తెల్సిందే. పైగా ఉ.కొరియా చేతిలో అణు బాంబులు ఉండటం పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని పలువురు అంతర్జాతీయ విశ్లేషకులు ఇప్పటికే అభిప్రాయపడిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో అమెరికన్ల గుండెల్లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గుబులు పుట్టిస్తున్నాడు. ఇటీవల దూకుడుగా ఆయన నిర్వహిస్తున్న క్షిపణి ప్రయోగ పరీక్షలు అందుకు కారణమవుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు.ఏదిఏమైనా కిమ్‌తో పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడమేనని అంతర్జాతీయ విశ్లేషకులు చెపుతున్నారు. రాజకీయ నిర్ణయాలతో పలు దేశాలను భయపెడుతున్నఅధ్యక్షుడు ట్రంప్ కు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మాత్రం చమటలు పుట్టిస్తున్నాడనే చెప్పవచ్చు.