ఉత్తర కొరియా ఇవాళ మళ్లీ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. అయితే ఆ క్షిపణి పరీక్ష విఫలమైనట్లు తెలుస్తున్నది. నార్త్ కొరియా బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించినట్లు దక్షిణ కొరియా, అమెరికా సైన్యం పేర్కొన్నాయి. క్షిపణి ఎగిరిన కొన్ని సెకండ్లలోనే పేలినట్లు దక్షిణ కొరియా మిలిటరీ వర్గాలు వెల్లడించాయి. ఆ మిస్సైల్ నార్త్ కొరియా భూభాగాన్ని కూడా దాటలేకపోయిందని అమెరికా మిలిటరీ పేర్కొన్నది. సౌత్ పియంగాన్ ప్రావిన్స్ నుంచి మిస్సైల్‌ను పరీక్షించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. చైనా ఆకాంక్షలను నార్త్ కొరియా గౌరవించలేదన్నారు. అణు సామర్థ్యం కలిగి సుదీర్ఘ దూరం ప్రయాణించే క్షిపణులను నార్త్ కొరియా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.