//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఢిల్లీ లో హై టెంక్షన్.....నేడే అవిశ్వాసం....!

Category : politics

ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పై ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నిరవధికంగా చర్చ జరగనున్నది. దీనిపై ఇప్పటికే అన్ని పార్టీలు సిద్ధమైయ్యాయి. టీడీపీ ఎలాగైనా ఏపీకి న్యాయం జరిగేలాగా చూడాలని చూస్తుంది.

బీజేపీ కూడా తగిన వ్యూహంతో పార్లమెంట్ కి వస్తుందని సమాచారం. ఇప్పటి వరకు ఏపీ కి చేసిన సహాయం మొత్తం చిల్లి గవ్వ తో సహా లెక్కలు చూపించాలని మోడీ తగిన అధికారులకి చెప్పాడని సమాచారం.

శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై చర్చను ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రారంభిస్తారు. అవిశ్వాసంపై పలు పార్టీలు నోటీసు ఇచ్చినా... మొదట ఇచ్చిన టీడీపీ నోటీసునే పరిగణనలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తీర్మానంపై తొలుత మాట్లాడే అవకాశం కూడా టీడీపీకి లభిస్తుంది.

గతంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగిస్తూ... ‘మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అంటూ ఏపీ సమస్యలను గల్లా జయదేవ్‌ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన ప్రసంగించిన తీరు అత్యధికుల ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో అవిశ్వాసంపై చర్చను ప్రారంభించే అవకాశాన్ని కూడా ఆయనకే ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. చూడాలి మరి కాసేపట్లో పార్లమెంట్ వేదికగా ఏదీ జరుగుతుందో