అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నిత్యానంద స్వామికి కర్ణాటకలోని రామనగర సెషన్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ తాజా గా జారీ చేసింది.
అత్యాచారం కేసు విచారణకు నిత్యానంద స్వామి నాలుగు రోజులుగా రాకుండా నిత్యానంద స్వామి పరారీలో ఉన్నాడని కోర్టు తెలిపింది. ఈ సారి కోర్టు విచారణకు ఆయన తప్పకుండా హాజరు కావాలని సెషన్స్ కోర్టు జడ్జి ఆదేశించారు.
ఎనిమిదేళ్ల క్రితం అత్యాచార కేసులో బెంగళూరు సమీపంలోని బిడది ఆశ్రమంలో ఉండే నిత్యానంద స్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు .