//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాబ్లీ ప్రాజెక్ట్ కేసులో చంద్రబాబుకి నోటీసులా ?

Category : politics

ఇన్నేళ్ల తరువాత బాబ్లీ ప్రాజెక్ట్ కేసులో చంద్రబాబుకి నోటీసులా ? నిజంగా ఈ వార్త కరక్టే అయితే దీని ద్వారా బిజెపికి ఏంటి లాభం ?. మరి చంద్రబాబుకి లాభమా ? నష్టమా ?

బిజెపి ఆశిస్తోన్న ప్రయోజనాలు :

బిజెపికి వ్యతిరేకంగా చంద్రబాబు ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతీయ పార్టీల కూటమికి శివసేనని దూరంగా వుంచడం. మహారాష్ట్రకి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాడితే అలాంటి వ్యక్తితో ఎలా కలుస్తారని శివసేనని సెంటిమెంటుతో కట్టడి చేసే ప్రయత్నం.తద్వారా ప్రాంతీయ కూటమిని బలహీనపరిచే ప్రయత్నం.

కాంగ్రెస్ , చంద్రబాబుల మధ్య సయోధ్య కుదరకుండా చేయడం. మహారాష్ట్రకి వ్యతిరేకి అయిన చంద్రబాబుతో కాంగ్రెస్ కుమ్మక్కు అవుతోందంటూ ధ్వజమెత్తి ఆ రాష్ట్రంలో సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ది పొందాలనే ప్రయత్నం.ఆ రాష్ట్రంలో రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో చంద్రబాబుకి సయోధ్య కుదరనివ్వకుండా చేసే ప్రయత్నం.

మరి చంద్రబాబుకి లాభమా ? నష్టమా ?

మహారాష్ట్రలో రాజకీయం ఎలా వున్నా చంద్రబాబుకి మాత్రం ఖచ్చితంగా లాభమే. అప్పట్లో తెలంగాణ సెంటిమెంట్ ఉధృతిలో చంద్రబాబు చేసిన పోరాటాన్ని తెలంగాణ ప్రజలు సరిగా గుర్తించలేకపోయారు.తమ కోసమే ఆయన పోరాడుతున్నారని తెలంగాణ మేధావులకు తెలిసినా చంద్రబాబుకి బాసటగా నిలవలేదు.కానీ ప్రజలు ఇప్పుడు వాస్తవంలోకి వచ్చారు.బంగారు తెలంగాణ చేస్తానన్న కెసిఆర్ పాలనతో ప్రజలు ఏ మాత్రం సంతోషంగా లేరు.ఇప్పుడు ఈ కేసు ద్వారా చంద్రబాబు అప్పట్లో తెలంగాణ ప్రాంతం కోసం చేసిన పోరాటం ప్రజలకు గుర్తుకు వస్తుంది. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి ఎంతో ఉపయోగమే తప్ప నష్టం వుండదు..తెలంగాణలో పార్టీకి మంచి ఊపు వస్తుంది.

ఇక ఎపి విషయంలో కూడా ఈ కేసు వల్ల చంద్రబాబుకి ఉపయోగమే. తమ ముఖ్యమంత్రిని జాతీయ స్థాయిలో కుట్ర పన్ని కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్ర ప్రాంత ప్రజలు భావిస్తారు.దీని వల్ల ఇప్పటివరకూ న్యూట్రల్ గా వున్న వాళ్ళు ఇకపై చంద్రబాబుకి సపోర్ట్ చేస్తారు. ఇప్పటివరకూ వ్యతిరేకించిన వాళ్లలో కూడా కొంత మార్పు వస్తుంది.. ఆంధ్రాలో చంద్రబాబు ఇమేజ్ బాగా పెరుగుతుంది.

బిజెపి వాళ్లు ఆశించేవి జరుగుతాయో లేదో గానీ చంద్రబాబుకి మాత్రం ఖచ్చితంగా ఉపయోగమే.తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి ఇంకా మద్దతు పెరగడమే కాకుండా దేశ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అత్యధిక శాతం బిజెపి కి వ్యతిరేకంగా వేయించడంలో చంద్రబాబు సఫలం అవుతారు..

#APCM #Apnews #Nonbailablewarrant #Appolitics #appoliticalnews #telugunews

Related News