//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నోకియా 3310 ఫోన్ ధర రూ. 3310

Category : business

నోకియా బ్రాండు ఫీచర్ ఫోన్ 3310 ఎట్టకేలకు భారత్ లోకి అధికారికంగా వచ్చేసింది. 2017 మే 18 నుంచి ఈ ఫోన్ భారత్ లోని అన్ని ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానున్నది. నోకియా కొత్త ఓనర్ హెచ్ఎండీ గ్లోబల్ ఈ ఫోన్ ను అధికారికంగా భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ 3310 మోడల్ ఫోన్ ధరను 3310 గా నిర్ణయించారు. నోకియాను సొంతం చేసుకున్న హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ రూపొందించిన తొలి ఫోన్ ఇదే. డార్క్ బ్లూ, గ్రే, రెడ్, ఎల్లో నాలుగు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రానున్నది.

2017 నోకియా 3310 ఫీచర్లు..

2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లే

1200ఎంఏహెచ్ బ్యాటరీ(22.1 గంటల వరకు టాక్ టైమ్ పవర్)

రేడియో, మ్యూజిక్ ప్లేయర్, నోకియా మైక్రోయూఎస్బీ ఛార్జర్

16ఎంబీ ఫోన్ స్పేస్

32జీబీ వరకు మైక్రోఎస్డీ కార్డుతో వాడుకోవచ్చు

2ఎంపీ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్

బ్రౌజింగ్ ఆప్షన్ ఉంటుంది కానీ యాప్స్ డౌన్ లోడ్ కు అవకాశం లేదు.