ఒకప్పుడు మొబైల్ ఫోన్ రంగంలో తిరుగులేని బ్రాండ్ నోకియా. స్మార్ట్ ఫోన్ల ఆగమనంతో నోకియా బ్రాండ్ తన వైభవం కోల్పోయింది. తాజాగా తన పునర్ వైభవం కోసం నోకియా కొత్త కొత్త ఫోన్లతో మార్కెట్లోకి వస్తోంది.మరో నోకియా ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.
నోకియా 150 పేరుతో ఈ ఫోన్ను హెచ్ఎండి గ్లోబల్ విడుదల చేసింది. డ్యూయల్ సిమ్, 2.4 అంగుళాల క్యువిజిఎ డిస్ప్లే, 1020 ఎంఎహెచ్ బ్యాటరీ, మైక్రో ఎస్డి కార్డుతో 32 జిబిల వరకు మెమరీని పెంచుకునే సదుపాయం వంటివి ఈ ఫోన్లో ఉన్నాయి.నోకియా 150 డ్యూయల్ సిమ్ ఫీచర్స్ కలిగిన ఈ ఫోన్, ఫ్లిప్ కార్ట్ లో తెలుపు లేదా నలుపు రంగుల్లో లభ్యమవుతుండగా.. అమెజాన్ ఇండియాలో కేవలం నలుపు రంగు ఫోన్ మాత్రమే అందుబాటులో ఉంది. టాక్ టైమ్ 22 గంటల వరకు, స్టాండ్బై టైమ్ 25 గంటల వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది.
అతిపెద్ద ఫీచర్ ఫోన్ల మార్కెట్లో భారత కూడా ఒకటని, సులభంగా ఉపయోగించుకునే అవకాశం ఉండటంతోపాటు ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉండే ఫోన్లకు ఇక్కడి కస్టమర్లు కోరుకుంటున్నారని హెచ్ఎండి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ మెహతా తెలిపారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నోకియా 150ని తెచ్చామన్నారు.