తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇక నుంచి అంతర్జాతీయ విమానాల్లో ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు అందించే భోజనాల్లో సూప్కు పుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించింది. ఆ స్థానంలో కొన్ని మ్యాగజైన్లు పెట్టనుంది. తద్వారా విమాన బరువు తగ్గడంతో ఆయిల్ ఖర్చు కూడా తగ్గుతుందని భావిస్తోంది. రూ.52 వేల కోట్ల అప్పల్లో కూరుకుపోయిన ఎయిరిండియా అందులో నుంచి బయటపడేందుకు నానాపాట్లు పడుతోంది. అందులో భాగంగానే ఇటువంటి నిర్ణయాల దిశగా ఆలోచిస్తోంది. కేబిన్ క్రూ ఇన్చార్జ్ ఒకరు ఇచ్చిన సలహా మేరకు ప్రభుత్వం ఇటువంటి మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్లో 20 శాతం సలాడ్ ఉంటోంది. దీనిని పూర్తిగా తీసేసి ఎయిరిండియాకు చెందిన శుభయాత్ర మ్యాగజైన్ కాపీలను 25 పెడితే సరిపోతుందని ఆయన సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే కాక్పిట్ డోర్ కర్టెన్ను కూడా తొలగించాలని సూచించినట్టు సమాచారం. ఇటువంటి చిన్నచిన్న పనుల వల్ల విమానం బరువు తగ్గుతుందని, ఫలితంగా ప్రయాణానికి అయ్యే ఆయిల్ ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చని సూచించినట్టు తెలుస్తోంది.