//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇక నుంచి పాస్‌పోర్టులో పుట్టింటి పేరు

Category : national

పెళ్లి తర్వాత మహిళలు పాస్‌పోర్టులో తమ ఇంటి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని, తల్లి లేదా తండ్రి ఇంటి పేరు తెలియజేసి పాస్‌పోర్టు పొందొచ్చని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.ఈ శుభవార్తను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జరిగిన భారత వ్యాపార మండలి మహిళా విభాగం సమావేశంలో ప్రకటించారు. అభివృద్ధి పథకాల్లో మహిళలకు కేంద్రం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పెంచామని, ఆసుపత్రిలో ప్రసవం జరిగితే రూ.6000 వేల నగదును మహిళల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ఉజ్వల పథకం కింద ఇంతవరకు రెండు కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని, రానున్న రెండేళ్లలో 5 కోట్ల మందికి ఇవ్వనున్నామని చెప్పారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.