//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మార్కెట్లపై కనిపించని వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం

Category : business

రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం సమీక్షలో కీలక వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ మార్కెట్లలో ఆ ప్రభావం కనబడటం లేదు. ఆర్‌బిఐ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తూ ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయాన్ని మదుపర్లు తేలికగా తీసుకున్నట్టుగా స్పష్టమవుతున్నది. 

వడ్డీ రేట్ల తగ్గింపు అనంతరం బుధ, గురు వారాలలో  దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇంతక్రితం సెషన్‌ వరకు వరుసగా పెరిగిన మార్కెట్ల నేపథ్యంలో మదుపర్లు కూడా లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఆయిల్‌ ధరలు తగ్గడంతో యూరోపియన్‌ మార్కెట్లు పడిపోగా, ఏషియన్‌ మార్కెట్లు మిశ్రమ లాభాలను నమోదు చేశాయి. 

గురువారం  సెన్సెక్స్‌ 239 పాయింట్లు నష్టపోయి 32238 వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పాయింట్లు నష్టపోయి 10014 వద్ద ముగిసింది. కాగా బుధ‌వారం  బిఎస్‌ఇలో సెన్సెక్స్‌ 98.43పాయింట్లు తగ్గి 32,476.74 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిప్టీ 33.15 పాయింట్లు నష్టపోయి 10,081.50 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ రంగాల వారిగా ఐటీ సూచీ 088శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.83శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.76శాతం, టెక్‌ 0.75శాతం చొప్పున పడిపోయాయి.