//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హెచ్1బి వీసాలపై చూపని ఆంక్షల ప్రభావం

Category : world

హెచ్1బి వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధించినప్పటికీ ఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయుల్లో భారతీయులదే అగ్ర తాంబూలంగా కొనసాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం హెచ్1బి వీసాల కోసం దాఖలైన దరఖాస్తుల్లో 74శాతం భారత్ నుంచి వచ్చినవేనని తాజాగా వెల్లడైన వివరాలను బట్టి తెలుస్తోంది.

జూన్ 30 వరకు ఈ వీసాల కోసం 3.36లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వీటిలో 1.97లక్షల దరఖాస్తులను ఆమోదించటం జరిగిందని అమెరికా పౌరసత్వ ఇమ్మిగ్రేషన్ సర్వీసుల విభాగం తెలిపింది. మిగతా దరఖాస్తులన్నీ పరిశీలనలో ఉన్నాయని వెల్లడించింది.

అత్యధిక స్థాయిలో ఈ వీసాల కోసం భారతీయులే దరఖాస్తులు చేసుకుంటున్నారు కాబట్టి వారికే గరిష్ఠ స్థాయిలో ఇవి లభించే అవకాశాలుంటాయని అమెరికా సెనెటర్లు చెప్తున్నారు. అత్యధిక స్థాయిలో హెచ్1బి వీసాలు పొందుతున్న ఐటి సంస్థల్లో టెక్నాలజీ రంగమే అగ్రస్థానంలో ఉంది. వాటిలో కాగ్నిజాంట్(అమెరికా), ఇన్ఫోసిస్, టిసిఎస్, యాక్సెంచర్, విప్రోలు ఉన్నాయి.

Related News